విరాట్ కోహ్లీ.. సాధారణంగా బ్యాటుతో రికార్డులు బద్దలుకొడుతుంటాడు. అడపాదడపా బౌలింగ్ చేసి 8 వికెట్లు తీయగలిగాడు. జట్టు సభ్యులు ఎవరూ తన బౌలింగ్‌ను సీరియస్‌గా చూడట్లేదని, వారు నమ్మకముంచితే మరిన్ని వికెట్లు తీస్తానంటున్నాడీ స్టార్ బ్యాట్స్‌మెన్. 2017 తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో బౌలింగ్ చేయకపోవడానికి గల కారణాల్ని వివరించాడు.
"2017లో శ్రీలంకతో ఓ మ్యాచ్‌లో దాదాపు గెలిచే పరిస్థితిలో ఉన్నాం. ఆ సమయంలో అప్పటి కెప్టెన్ ధోనిని బౌలింగ్ ఇమ్మని అడిగా. నేను సిద్ధమవుతుండగా బౌండరీ దగ్గరున్న బుమ్రా గట్టిగా అరుస్తూ... ఇది చిన్నపిల్లల ఆట కాదు.. అంతర్జాతీయ మ్యాచ్ అన్నాడు. జట్టులో ఎవరూ నేను బౌలింగ్ చేస్తానంటే నమ్మడం లేదు." -విరాట్ కోహ్లీ, టీమిండియా కెప్టెన్
ప్రపంచకప్‌లో భాగంగా ఇటీవల నెట్స్‌లో బౌలింగ్ చేస్తూ కనిపించాడు కోహ్లీ. వన్డేల్లో, టీ-20ల్లో తలో 4 వికెట్లు తీశాడు. టెస్టుల్లో వికెట్లేమి తీయలేకపోయాడు. బౌలింగ్‌పైన ఆసక్తి రావడానికి గల కారణాన్ని వివరించాడీ క్రికెటర్.
"దిల్లీలోని అకాడమీలో ఉండేటపుడు జేమ్స్ అండర్సన్ శైలిని అనుకరించేవాడ్ని. ఆ తర్వాత అతడ్ని కలిసే అవకాశం దక్కింది. ఈ కథనంతటిని అండర్సన్‌కు చెప్పి ఇద్దరం గట్టిగా నవ్వుకున్నాం" - విరాట్ కోహ్లీ, టీమిండియా కెప్టెన్
ఇది చదవండి: కెప్టెన్ కోహ్లీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన దక్షిణాఫ్రికా బౌలర్ రబాడా