ఐసీసీ వచ్చే ఏడాది కోసం ప్రకటించిన ఎమిరేట్స్ ఎలైట్ ప్యానల్లో ఇద్దరు కొత్త అంపైర్లకు చోటు దక్కింది. వారు మైకేల్ గౌ, జో విల్సన్. ఇప్పటికే ఉన్న భారతదేశానికి చెందిన ఎస్.రవి చోటు కోల్పోయారు. మొత్తం 12 మంది సభ్యులున్న ఈ జాబితాలో స్థానం నిలుపుకోలేకపోయారు.
2015లో అంపైర్స్ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నారు రవి. దాదాపు 11 ఏళ్ల తర్వాత ఆ స్థానం సంపాదించిన భారతీయుడిగా నిలిచారు. ఇంతకు ముందు 2004 వరకు ఎస్.వెంకట్ రాఘవన్ ఆ ప్యానల్లో విధులు నిర్వర్తించారు.
"ఎలైట్ అంపైర్ ప్యానల్లోని సభ్యులను ఎంపిక చేయడం నిజంగా ఛాలెంజ్‌తో కూడుకున్నది. మనం తీసుకునే ప్రతి నిర్ణయం ఎంతో మంది అభిమానులకు సంబంధించింది. రానున్న ఏడాది పాటు వారు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి నిర్ణయం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఈ ఏడాది మైకేల్ గౌ, జో విల్సన్ ఆ జాబితాలో చోటు దక్కించుకున్నారు. వారు మెరుగ్గా రాణించాలని కోరుకుంటున్నా" -అడ్రియన్ గ్రిఫ్ఫిత్, ఐసీసీ సీనియర్ మేనేజర్
ఎలైట్ ప్యానల్ అంపైర్లు: అలీందార్, కుమార ధర్మసేన, ఎరస్మస్, క్రిస్ గఫ్ఫనే, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, రిచర్డ్ కెటల్‌బరో, నీగెల్ లాంగ్, బ్రూస్ ఆక్స్న్ఫోర్డ్, పాల్ రీఫిల్, రాడ్ టకర్, మైకేల్ గౌ, జో విల్సన్
ఎలైట్ ప్యానల్ రిఫరీలు: డేవిడ్ బూన్, క్రిస్ బ్రాడ్, జెఫ్ క్రో, రంజన్ మదుగలే, ఆండీ పైక్రాఫ్ట్, రిచ్ రిచర్డ్సన్, జవగళ్ శ్రీకాంత్
ఇది చదవండి: ఐసీసీ ఎలైట్ ప్యానల్లో ఇద్దరు కొత్త అంపైర్లు