అంతర్జాతీయ క్రికెట్లో ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌కు సరిసమానమైన ఆటగాడు ఎవ్వరూ లేరని టీమ్ఇండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. ఇటీవలే ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఇంగ్లాండ్ ప్రపంచ కప్ హీరో స్టోక్స్.. వెస్టిండీస్‌తో జరుగుతోన్న టెస్టు సిరీస్‌లో టాప్ ఫామ్‌లో ఉన్నాడు. రెండో టెస్టులో ఇంగ్లీష్ జట్టు గెలవడానికి తన వంతు కృషి చేశాడు. ఇందులో 176 పరుగులు చేశాడు. ఇప్పటివరకు జరిగిన రెండు టెస్టుల్లో 9 వికెట్లు సహా.. 313 పరుగులు సాధించాడు.
"ప్రస్తుతం భారత ఆటగాళ్లలో ఎవరినీ బెన్ స్టోక్స్‌తో పోల్చలేరు. కచ్చితంగా చెప్తున్నా. ఎందుకంటే, స్టోక్స్ తన సొంత గేమ్‌ను ఆడుతున్నాడు. టెస్టు క్రికెట్, వన్డే, టీ20 మ్యాచ్‌ల్లో అతని ప్రదర్శనను ఒకసారి చూస్తే.. అందుకు దీటుగా ఎవరూ లేరనిపిస్తుంది. ప్రస్తుతానికైతే అంతర్జాతీయ క్రికెట్‌తో అతనికి సరిసమానంగా ఎవ్వరూ లేరు."
-గౌతమ్ గంభీర్, టీమ్ఇండియా మాజీ ఓపెనర్
ప్రతి కెప్టెన్ స్టోక్స్‌లాంటి ఆటగాడు తమ జట్టులో ఉండాలని కోరుకుంటాడని అన్నాడు గంభీర్. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో జో రూట్ లేనందున.. ఇంగ్లాండ్ జట్టుకు సారథ్యం వహించాడు స్టోక్స్. ఈ క్రమంలోనే స్టోక్స్ నాయకత్వ లక్షణాలను ప్రశంసించాడు గంభీర్.