కార్డిఫ్ వేదికగా జరిగిన ప్రపంచకప్ మ్యాచ్‌లో శ్రీలంకపై న్యూజిలాండ్ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. లంకేయులు నిర్దేశించిన 137 పరుగుల లక్ష్యాన్ని 16.1 ఓవర్లలోనే ఛేదించి.. ప్రపంచకప్‌లో శుభారంభం చేసింది. కివీస్ ఓపెనర్లు ఇద్దరూ అర్ధశతకాలతో చెలరేగారు.
-
VICTORY! Martin Guptill (74*) and Colin Munro (58*) complete the job for the team without losing a wicket, superb effort!
— BLACKCAPS (@BLACKCAPS) June 1, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
CARD | https://t.co/v0ZonaJtee #BACKTHEBLACKCAPS #CWC19 #NZvSL pic.twitter.com/JWNs2fIRwt
">VICTORY! Martin Guptill (74*) and Colin Munro (58*) complete the job for the team without losing a wicket, superb effort!
— BLACKCAPS (@BLACKCAPS) June 1, 2019
CARD | https://t.co/v0ZonaJtee #BACKTHEBLACKCAPS #CWC19 #NZvSL pic.twitter.com/JWNs2fIRwtVICTORY! Martin Guptill (74*) and Colin Munro (58*) complete the job for the team without losing a wicket, superb effort!
— BLACKCAPS (@BLACKCAPS) June 1, 2019
CARD | https://t.co/v0ZonaJtee #BACKTHEBLACKCAPS #CWC19 #NZvSL pic.twitter.com/JWNs2fIRwt
137 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఆది నుంచి దూకుడుగా ఆడింది. ఓపెనర్లు గప్తిల్, మన్రో... ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా స్వేచ్ఛగా పరుగులు చేశారు. ఈ క్రమంలోనే అర్ధ శతకాలు పూర్తి చేసుకున్నారు. గప్తిల్ 73, మన్రో 58 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ తొలి విజయం నమోదు చేయడంలో కీలక పాత్ర పోషించారు.
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక.. ఇన్నింగ్స్ ప్రారంభం నుంచి వరుసగా వికెట్లు చేజార్చుకుంది. కెప్టెన్ తిరిమన్నె అర్ధ శతకం చేశాడు. మిగతా బ్యాట్స్‌మెన్‌లో కుశాల్ పెరీరా 29, తిశారా పెరీరా 27 మినహా మిగిలిన వారందరూ సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి 136 పరుగులకే శ్రీలంక ఆలౌట్ అయింది.
కివీస్ బౌలర్లలో హెన్రీ, ఫెర్గ్యూసన్ తలో మూడు వికెట్లు తీశారు. బౌల్ట్, గ్రాండ్‌హోమ్, నీషమ్, శాంట్నర్ తలో వికెట్ దక్కించుకున్నారు.