టీమిండియాతో ఉత్కంఠకర పోరుకు సిద్ధమవుతున్న కివీస్ జట్టుకు ఊహించని దెబ్బ తగిలింది. ఆ జట్టు బ్యాట్స్‌మన్ టామ్ లాథమ్... వేలి గాయంతో టీ20 సీరీస్‌కు దూరమయ్యాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో ఈ దెబ్బ తగిలినట్లు జట్టు వర్గాలు పేర్కొన్నాయి. ఈ క్రికెటర్‌కు నెల రోజులు విశ్రాంతి సూచించారు వైద్యులు. ఫలితంగా భారత్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు దూరం కానున్నాడు.
-
Some bad news for New Zealand fans 👇https://t.co/kntr323fIP
— ICC (@ICC) January 8, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Some bad news for New Zealand fans 👇https://t.co/kntr323fIP
— ICC (@ICC) January 8, 2020Some bad news for New Zealand fans 👇https://t.co/kntr323fIP
— ICC (@ICC) January 8, 2020
ఇతడితో పాటు న్యూజిలాండ్ పేసర్లు ట్రెంట్ బౌల్ట్, ల్యూక్ ఫెర్గుసన్.. గాయాలతో ఇబ్బంది పడుతున్నారు. మ్యాచ్‌లు మొదలయ్యేసరికి వీరిద్దరూ కోలుకుంటారని యాజమాన్యం భావిస్తోంది. వీరిపై వైద్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
కొన్ని రోజులుగా న్యూజిలాండ్ జట్టు గాయాలతో బాధపడుతోంది. ఆ దేశ బౌలర్ మ్యాట్ హెన్రీ వేలి గాయంతో విశ్రాంతి తీసుకొని.. తాజాగా జరిగిన ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌కు అందుబాటులోకి వచ్చాడు. కివీస్ సారథి కేన్ విలియమ్సన్, మిచెల్ శాంట్నర్, నికోలస్ హెన్రీ.. జ్వరం నుంచి కోలుకున్నారు. తాజాగా ఆసీస్‌తో మూడు టెస్టులు ఆడితే అన్నింట్లోనూ ఓడిపోయింది కివీస్.
ఈనెల 24 నుంచి మార్చి 4 మధ్య న్యూజిలాండ్‌లో పర్యటించనుంది టీమిండియా. ఇందులో భాగంగా 5 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్టులు ఆడనున్నాయి ఇరుజట్లు.
-
BACK in NZ! A bit of airport media for the boys after we returned home from Aussie ➡️ Now we look ahead to a home series against India 🇮🇳 #cricketnation pic.twitter.com/H8kvOfc793
— BLACKCAPS (@BLACKCAPS) January 8, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">BACK in NZ! A bit of airport media for the boys after we returned home from Aussie ➡️ Now we look ahead to a home series against India 🇮🇳 #cricketnation pic.twitter.com/H8kvOfc793
— BLACKCAPS (@BLACKCAPS) January 8, 2020BACK in NZ! A bit of airport media for the boys after we returned home from Aussie ➡️ Now we look ahead to a home series against India 🇮🇳 #cricketnation pic.twitter.com/H8kvOfc793
— BLACKCAPS (@BLACKCAPS) January 8, 2020