న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఘనవిజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన 133 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ మూడు వికెట్లు కోల్పోయి 17.3 ఓవర్లలో ఛేదించింది. కేఎల్ రాహుల్(57*; 50 బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్(44; 33 బంతుల్లో 1ఫోర్, 3సిక్సర్లు) మరోసారి బాధ్యతాయుతంగా ఆడారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 86 పరుగులు జోడించారు. రోహిత్‌శర్మ(8; 6 బంతుల్లో 2ఫోర్లు), కెప్టెన్ విరాట్ కోహ్లీ(11; 12 బంతుల్లో 1x4) విఫలమయ్యారు. శ్రేయస్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన శివమ్ దూబె(8; 4 బంతుల్లో 1సిక్సర్) రాహుల్‌తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.
తాజా విజయంతో ఐదు టెస్టుల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది టీమిండియా. ఈ మ్యాచ్‌లో పలు రికార్డులు నమోదయ్యాయి.
-
Clinical performance by #TeamIndia to take a 2-0 lead in the series 🔥🙌 #NZvIND pic.twitter.com/kYNGckrhjz
— BCCI (@BCCI) January 26, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Clinical performance by #TeamIndia to take a 2-0 lead in the series 🔥🙌 #NZvIND pic.twitter.com/kYNGckrhjz
— BCCI (@BCCI) January 26, 2020Clinical performance by #TeamIndia to take a 2-0 lead in the series 🔥🙌 #NZvIND pic.twitter.com/kYNGckrhjz
— BCCI (@BCCI) January 26, 2020
>> న్యూజిలాండ్‌పై రెండు టీ20 మ్యాచ్‌లు వరుసగా గెలవడం టీమిండియాకు ఇదే తొలిసారి.
>> ఆక్లాండ్‌లోని ఈడెన్ మైదానం టీమిండియాకు ఫేవరెట్‌గా మారింది. ఇప్పటివరకు ఈ వేదికపై ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ భారత్ విజయం సాధించింది. ఈ వేదికపై వరుసగా మూడు టీ20లు గెలిచిన తొలి ఆసియా జట్టుగా చరిత్ర సృష్టించింది టీమిండియా.
- రాహుల్ అదుర్స్...
>>కేఎల్ రాహుల్ తన చివరి అయిదు టీ20ల్లో నాలుగు అర్ధశతకాలు (91, 45, 54, 56, 57*) సాధించాడు.
>> టీ20ల్లో వరుసగా మూడు అర్ధ సెంచరీలు చేసిన భారత బ్యాట్స్‌మెన్ జాబితాలో చోటు దక్కించుకున్నాడు కేఎల్ రాహుల్. కోహ్లీ ఈ ఫీట్‌ను మూడు సార్లు(2012, 2014, 2016) సాధించగా... రోహిత్(2018), రాహుల్(2020) ఒక్కోసారి అందుకున్నారు.
>> పొట్టి ఫార్మాట్లో న్యూజిలాండ్‌పై అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో కేఎల్ రాహుల్ అగ్రస్థానంలో ఉన్నాడు. తాజా మ్యాచ్‌లో రెండోది నమోదు చేశాడు. ఇప్పటికే శ్రేయస్ అయ్యర్, రైనా, రోహిత్, యువరాజ్ తలో ఒక్క అర్ధశతకం సాధించారు.
-
FIFTY!
— BCCI (@BCCI) January 26, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Back to back half-centuries for @klrahul11 here at the Eden Park. This is his 11th in T20Is 👏👏
Live - https://t.co/q1SS955DVL #NZvIND pic.twitter.com/ZocrgJyWTK
">FIFTY!
— BCCI (@BCCI) January 26, 2020
Back to back half-centuries for @klrahul11 here at the Eden Park. This is his 11th in T20Is 👏👏
Live - https://t.co/q1SS955DVL #NZvIND pic.twitter.com/ZocrgJyWTKFIFTY!
— BCCI (@BCCI) January 26, 2020
Back to back half-centuries for @klrahul11 here at the Eden Park. This is his 11th in T20Is 👏👏
Live - https://t.co/q1SS955DVL #NZvIND pic.twitter.com/ZocrgJyWTK
- కోహ్లీ రెండో స్థానం...
టీ20ల్లో వ్యక్తిగత 35 ఇన్నింగ్స్‌ల తర్వాత నుంచి లెక్కిస్తే అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో.. కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. పాక్ క్రికెటర్ బాబర్ అజామ్(1399), కోహ్లీ(1368), కేఎల్ రాహుల్(1350) వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. మిగతా ఏ క్రికెటర్ 1200లకు పైగా రన్స్ చేయలేకపోయారు.
>> కోహ్లీ, రాహుల్ కలిసి చివరగా ఆడిన నాలుగు టీ20ల్లో 325 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
- సిక్సర్లతోనే...
భారత్ చివరిగా ఆడిన నాలుగు ఛేదనల్లో అన్ని మ్యాచ్‌లను సిక్సర్లతోనే ముగించారు భారత బ్యాట్స్‌మెన్.
వెస్టిండీస్‌పై (కోహ్లీ)-2019
శ్రీలంకపై (కోహ్లీ)-2020
న్యూజిలాండ్‌పై (శ్రేయస్ అయ్యర్)- 2020
న్యూజిలాండ్‌పై (శివమ్ దూబే)-2020
జడేజా అత్యుత్తమం..
>> ఈ మ్యాచ్‌లో అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన నెలకొల్పాడు భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా. టీ20ల్లో న్యూజిలాండ్‌పై తక్కువ పరుగులు ఇచ్చిన ఆటగాళ్లలో ఇతడు రెండో అత్యుత్తమ బౌలర్‌గా నిలిచాడు.
హర్భజన్- 15/1 (2009)
రవీంద్ర జడేజా- 18/2 (2020)
హర్భజన్ - 19/1 (2009)
అంతేకాకుండా జడేజా బౌలింగ్‌లోనే న్యూజిలాంండ్ ఆటగాడు డీ గ్రాండ్ హోమ్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ గోల్డెన్ డకౌట్ అయ్యాడు.
>> కోహ్లీని అత్యధికసార్లు ఔట్ చేసిన పేస్ బౌలర్ల జాబితాలో అండర్సన్ సరసన నిలిచాడు సౌథీ. వీరిద్దరూ 8సార్లు విరాట్‌ను పెవిలియన్ చేర్చాడు. మోర్కెల్, రాంపాల్ (7 సార్లు) ఈ జాబితాలో తర్వాత స్థానంలో ఉన్నారు.
-
Tim Southee with two wickets in the first six overs! India 40/2 with Rahul 20* and Iyer 1* at the crease. LIVE scoring | https://t.co/t55dhYlIPh #NZvSA pic.twitter.com/B2O2fYnBcO
— BLACKCAPS (@BLACKCAPS) January 26, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Tim Southee with two wickets in the first six overs! India 40/2 with Rahul 20* and Iyer 1* at the crease. LIVE scoring | https://t.co/t55dhYlIPh #NZvSA pic.twitter.com/B2O2fYnBcO
— BLACKCAPS (@BLACKCAPS) January 26, 2020Tim Southee with two wickets in the first six overs! India 40/2 with Rahul 20* and Iyer 1* at the crease. LIVE scoring | https://t.co/t55dhYlIPh #NZvSA pic.twitter.com/B2O2fYnBcO
— BLACKCAPS (@BLACKCAPS) January 26, 2020
>> గత 11 టీ20 ఇన్నింగ్స్‌లో టీమిండియా హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఎనిమిది సార్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాడు. అంతేకాకుండా రోహిత్ తన కెరీర్‌లో 50 శాతానికిపైగా మ్యాచ్‌ల్లో పది బంతుల్లోపే ఔటయ్యాడు.
>> అంతర్జాతీయ క్రికెట్లో టిమ్ సౌథీ చేతిలో ఎక్కువ సార్లు ఔటైన జాబితాలో రోహిత్ రెండోస్థానంలో నిలిచాడు. 9సార్లు ఇతడు పెవిలియన్ చేరాడు. కరుణరత్నే(10) మొదటి స్థానంలో ఉండగా.. తమీమ్(9), మాథ్యూస్(8) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
>> టీ20ల్లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన భారత ఆటగాళ్లలో రెండో స్థానంలో నిలిచాడు కోహ్లీ. రైనా(42), కోహ్లీ(41), రోహిత్(39) జాబితాలో వరుసగా ఉన్నారు.
-
1️⃣ Martin Guptill – c Kohli b Thakur
— ICC (@ICC) January 26, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
2️⃣ Colin Munro – c Kohli b Dube
3️⃣ Colin de Grandhomme – c & b Jadeja
4️⃣ Kane Williamson – c Chahal b Jadeja
India are on 🔝 in Auckland!#NZvIND pic.twitter.com/MhyeA5wozT
">1️⃣ Martin Guptill – c Kohli b Thakur
— ICC (@ICC) January 26, 2020
2️⃣ Colin Munro – c Kohli b Dube
3️⃣ Colin de Grandhomme – c & b Jadeja
4️⃣ Kane Williamson – c Chahal b Jadeja
India are on 🔝 in Auckland!#NZvIND pic.twitter.com/MhyeA5wozT1️⃣ Martin Guptill – c Kohli b Thakur
— ICC (@ICC) January 26, 2020
2️⃣ Colin Munro – c Kohli b Dube
3️⃣ Colin de Grandhomme – c & b Jadeja
4️⃣ Kane Williamson – c Chahal b Jadeja
India are on 🔝 in Auckland!#NZvIND pic.twitter.com/MhyeA5wozT