ETV Bharat / sports

తొలి ఇన్నింగ్స్​లో భారత్​ 242 ఆలౌట్​.. కివీస్​ 63/0

క్రైస్ట్​చర్చ్​ వేదికగా భారత్​- న్యూజిలాండ్​ మధ్య రెండో టెస్టు మొదటిరోజు ఆట ముగిసింది. తొలుత బ్యాటింగ్​ చేసిన కోహ్లీసేన.. 242 పరుగులకు ఆలౌటైంది. న్యూజిలాండ్​ బ్యాటింగ్​ 63/0తో తొలిరోజు ముగించింది. క్రీజులో లాథమ్ (27), బ్లండెల్​ (29) ఉన్నారు.

New Zealand vs India, 2nd Test: New Zealand trail by 179 runs after Day 1 Stumps
రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్​: భారత్​ 242 ఆలౌట్​... కివీస్​ 63/0
author img

By

Published : Feb 29, 2020, 12:53 PM IST

Updated : Mar 2, 2020, 11:00 PM IST

భారత్​తో జరుగుతోన్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్​లో న్యూజిలాండ్​ రాణిస్తోంది. తొలుత బౌలింగ్​లో అదరగొట్టిన జట్టు... ప్రస్తుతం బ్యాటింగ్​లోనూ మంచి ఆరంభాన్ని అందుకుంది. మొదటిరోజు ఆట ముగిసేసరికి వికెట్లేమి కోల్పోకుండా 63 పరుగుల వద్ద నిలిచింది కివీస్​ జట్టు. భారత బౌలర్లు 23 ఓవర్లు వేసినా ఒక్క వికెట్టూ తీయలేకపోయారు. క్రీజులో లాథమ్ ​(27), బ్లండెల్ ​(29) అజేయంగా ఉన్నారు. ప్రస్తుతం 179 పరుగుల వెనుకంజలో ఉంది బ్లాక్​క్యాప్స్​.

కోహ్లీసేనది అదే తీరు..

తొలి టెస్టులో ఓటమి పాలైనా భారత జట్టు తీరు మారలేదు. మళ్లీ పాత కథే పునరావృతం చేసింది. భోజనానికి 85/2తో పటిష్ఠంగా కనిపించిన కోహ్లీసేన.. 194/5తో తేనీటి విరామానికి వెళ్లింది. కనీసం 300లైనా చేస్తారులే అనుకునేలోపు 48 పరుగుల వ్యవధిలో 6 వికెట్లు చేజార్చుకుంది. ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 242 పరుగులకు ఆలౌటైంది.

మయాంక్​ విఫలం

క్రైస్ట్‌చర్చ్‌లోనూ తొలి టెస్టులాగే పేలవ బ్యాటింగ్‌తో ఇన్నింగ్స్​ ఆరంభించింది టీమిండియా. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత బ్యాటింగ్‌ లైనప్‌ను కివీస్‌ యువ పేసర్‌ జేమీసన్‌ (5/45), టిమ్‌ సౌథీ (2), ట్రెంట్‌బౌల్ట్‌ (2) కుదేలు చేశారు. అనుకూలిస్తున్న వాతావరణం, చల్లని పరిస్థితులను ఆసరాగా చేసుకొని కట్టుదిట్టంగా బంతులు విసిరారు. తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీసేనను 63 ఓవర్లకు 242 పరుగులకే కుప్పకూల్చారు. ఓపెనర్‌ పృథ్వీషా 54 (54; 64 బంతుల్లో 8ఫోర్లు, 1సిక్సర్​) అర్ధశతకంతో మెరిసినా ఓపెనర్‌ మయాంక్‌ (7) జట్టు స్కోరు 30 వద్దే బౌల్ట్‌ బౌలింగ్‌లో ఎల్బీ అయ్యాడు. శుభారంభం అందించలేకపోయాడు.

ఆశలు రేపిన పుజారా, విహారి

వన్‌డౌన్‌లో వచ్చిన ఛెతేశ్వర్‌ పుజారా 54(54; 140 బంతుల్లో 6 ఫోర్లు) మునుపటి కన్నా కాస్త తీవ్రతతో ఆడి అర్ధశతకం అందుకున్నాడు. పృథ్వీషాతో కలిసి రెండో వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. జేమీసన్‌ వేసిన బంతి బ్యాటు అంచుకు తగిలి స్లిప్‌లో లేథమ్‌కు దొరకడం వల్ల జట్టు స్కోరు 80 వద్ద షా పెవిలియన్‌ చేరాడు. టీమిండియా 85/2తో లంచ్‌కు వెళ్లింది. ఆ తర్వాత 5 పరుగులకే విరాట్‌ కోహ్లీ (3; 15 బంతుల్లో)ని సౌథీ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అసహనంతో అతడు సమీక్ష కోరి విఫలమయ్యాడు. రహానె (7)నూ సౌథీనే ఔట్‌ చేశాడు.

జేమిసన్​ దెబ్బ...

ఈ క్రమంలో హనుమ విహారి 55(50 బంతుల్లో 10 ఫోర్లు) ఆకట్టుకున్నాడు. నయావాల్‌తో కలిసి ఐదో వికెట్‌కు 81 పరుగుల భాగస్వామ్యం అందించాడు. వీరిద్దరూ ఇలాగే ఆడితే భారత్‌ మంచి స్కోరే చేసేది. అద్భుతంగా బ్యాటింగ్‌ చేస్తున్న విహారిని కీలక సమయంలో వాగ్నర్‌ ఔట్‌ చేయడం వల్ల కోహ్లీసేన 194/5తో తేనీటి విరామం తీసుకుంది. పుజారాకు.. రిషభ్‌ పంత్‌ 12(14 బంతుల్లో 2ఫోర్లు), రవీంద్ర జడేజా 9(10 బంతుల్లో 2ఫోర్లు), ఉమేశ్‌ (0) సహకరిస్తారనుకుంటే ఈ నలుగురినీ జేమీసన్‌ వరుసగా పెవిలియన్‌ చేర్చి భారీ దెబ్బకొట్టాడు. ఫలితంగా టీమిండియా చివరి 6 వికెట్లు 48 పరుగుల వ్యవధిలో చేజార్చుకుంది.

వికెట్లు తీయలేని బౌలింగ్‌

పేస్‌, స్వింగ్‌కు అనుకూలిస్తున్న పరిస్థితులను న్యూజిలాండ్‌ తరహాలో భారత బౌలర్లు సద్వినియోగం చేసుకోలేకపోయారు. బంతులు బాగానే విసిరినా బౌలింగ్‌లో తీవ్రత, వైవిధ్యం కనిపించలేదు. అందుకే తొలి ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టపోకుండా 63 పరుగులతో తొలిరోజు ఆటను ముగించింది కివీస్​ జట్టు. ఓపెనర్లు టామ్‌ లేథమ్‌ (27; 65 బంతుల్లో 4ఫోర్లు), బ్లండెల్‌ (29; 73 బంతుల్లో 4ఫోర్లు) అజేయంగా నిలిచారు. బుమ్రా, ఉమేశ్‌, షమి వరుసగా దాడి చేసినా ఫలితం లేదు. వారు బంతిని స్వింగ్‌ చేయలేదు. రెండో రోజు, ఆదివారం ఉదయం చల్లని వాతావరణం, పరిస్థితులను ఉపయోగించుకొని వేగంగా వికెట్లు తీస్తేనే భారత్‌ ఓటమి పాలవ్వకుండా అవకాశాలు ఉంటాయి. లేదంటే ప్రత్యర్థికి 120 పాయింట్లు సమర్పించుకున్నట్టే!

ఇదీ చదవండి...

రెండో టెస్టు: జేమిసన్​ పాంచ్​ పటాకా.. భారత్​ 242 ఆలౌట్​

Last Updated : Mar 2, 2020, 11:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.