భారత్‌లో కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో ఐపీఎల్ 13వ సీజన్‌ను ఎక్కడ, ఎప్పుడు నిర్వహిస్తే సజావుగా సాగుతుందనే అంశంపై పరిశీలిస్తూనే ఉంది బీసీసీఐ. అయితే ఈ టోర్నీకి ఆతిథ్యమిచ్చేందుకు ఇప్పటికే శ్రీలంక, యూఏఈ దేశాలు ముందుకొచ్చాయి. తాజాగా ఈ రేసులోకి న్యూజిలాండ్ వచ్చింది. తమ దేశంలో లీగ్‌ను నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.
ఆటగాళ్ల సురక్షితమే ప్రాధాన్యత
న్యూజిలాండ్ ఆతిథ్యం ప్రతిపాదనపై ఓ బీసీసీఐ అధికారి స్పందించారు. భారత్‌లో కరోనా వల్ల టోర్నీ నిర్వహించడం సాధ్యంకాకపోతేనే విదేశీ గడ్డపై నిర్వహించేందుకు ప్రత్యామ్నయం చూస్తామని తెలిపారు. ఎక్కడ నిర్వహించిన ఆటగాళ్ల భద్రతే తమ తొలి ప్రాధాన్యతమని అన్నారు.
"స్వదేశంలోనే ఐపీఎల్ నిర్వహించాలనేది మా తొలి ప్రాధాన్యం. ఒకవేళ కుదరకపోతే ప్రత్యామ్నయంగా విదేశీ గడ్డపై ఎక్కడ నిర్వహించాలనేది బీసీసీఐ కమిటీ నిర్ణయిస్తుంది. ఇప్పటికే యూఏఈ, శ్రీలంక, న్యూజిలాండ్ దేశాలు ఆతిథ్యమివ్వడానికి ముందుకొచ్చాయి. కానీ ఎక్కడ నిర్వహించినా ఆటగాళ్ల భద్రతే మా తొలి ప్రాథాన్యత. దీనిపై రాజీపడేది లేదు"
-బీసీసీఐ అధికారి
గతంలో భారత్‌లో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా 2009లో దక్షిణాఫ్రికా, 2014లో యూఏఈలో ఐపీఎల్‌ను నిర్వహించారు. 2019లో మాత్రం తేదీల్లో మార్పులు చేసి స్వదేశంలోనే జరిపారు.
చైనా కంపెనీల స్పాన్సర్‌షిప్‌లు
జూన్ 15న గల్వాన్ లోయలో చైనాతో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. అప్పుడంతా భావోద్వేగం చెందడం వల్ల చైనా కంపెనీల స్పాన్సర్‌షిప్‌లను రద్దు చేసుకోవాలని బీసీసీఐని డిమాండ్ చేశారు. అయితే దీనిపై త్వరలోనే ఐపీఎల్ పాలక మండలి సమావేశం జరిపి ఓ నిర్ణయం తీసుకుంటుందని బీసీసీఐ అధికారి తెలిపారు.
అక్టోబర్-నవంబరులో ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ20 ప్రపంచకప్ వాయిదా పడితే సెప్టెంబరులో ఐపీఎల్ నిర్వహించాలని బోర్డు సన్నాహాలు చేస్తోంది. అయితే టీ20 ప్రపంచకప్ నిర్వహణపై ఐసీసీ స్పష్టతనిచ్చిన తర్వాతే దీని విషయంలో నిర్ణయం తీసుకుంటుందని అధికారి తెలిపారు.
ఇది చూడండి :
దుబాయ్ లేదా శ్రీలంకలో ఐపీఎల్-13!
- ఐపీఎల్ మ్యాచ్‌లో ఏడవడంపై కుల్దీప్ సమాధానమిదే
- ఐపీఎల్లో చైనా స్పాన్సర్లపై త్వరలోనే నిర్ణయం
- ఐపీఎల్లో వార్నర్‌తో పాటు ఆసీస్ క్రికెటర్లందరూ
- 'ఐపీఎల్ ఆలస్యానికి ఆయనే కారణం'
- ఐపీఎల్ 2020: టోర్నీ నిర్వహించేది ఈ తేదీల్లోనే!
- ఐపీఎల్‌కు సిద్ధంగా ఉండండి: గంగూలీ
- 'అవకాశం ఇస్తే.. ఐపీఎల్ నిర్వహణకు మేము రెడీ'
- స్వదేశీ క్రికెటర్లతోనే ఐపీఎల్-2020 జరిగితే..?