ETV Bharat / sports

కివీస్ మహిళా జట్టుకు కెప్టెన్​గా సోఫీ డివైన్​

న్యూజిలాండ్​ మహిళా క్రికెట్​ జట్టుకు సోఫీ డివైన్​ దీర్ఘకాలపు సారథిగా బాధ్యతలు స్వీకరించింది. అమీ శాటర్త్ ‌వైట్‌ వైస్​ కెప్టెన్​గా ఎంపికైంది.

author img

By

Published : Jul 9, 2020, 11:53 AM IST

sophie
సోఫీ డివైన్

గతసీజన్​లో న్యూజిలాండ్​ మహిళా క్రికెట్​ జట్టుకు తాత్కాలిక సారథిగా బాధ్యతలు చేపట్టిన సోఫీ డివైన్​ను పూర్తి కాల కెప్టెన్​గా ప్రకటించింది కివీస్ క్రికెట్ బోర్డు. దీంతోపాటు మాతృత్వ సెలవులు తీసుకుని జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన మరో కీలక క్రికెటర్​ అమీ శాటర్త్‌ వైట్‌కు వైస్​ కెప్టెన్​ బాధ్యతలు అప్పగించింది.

Sophie Devine a
సోఫీ డివైన్

"అమీ శాటర్త్ ‌వైట్‌తో కలిసి పనిచేయడం నాకెంతో సంతోషంగా ఉంది. జట్టుకు బలమైన భాగస్వామ్య నాయకత్వంగా మేమిద్దరం నిలుస్తామని భావిస్తున్నా."

-సోఫీ డివైన్​, కివీస్ సారథి.

ammi
అమీ శాటర్త్‌వైట్

"మళ్లీ అంతర్జాతీయ క్రికెట్​లోకి రీఎంట్రీ ఇవ్వడం ఆనందంగా ఉంది. జట్టు విజయానికి నా వంతు కృషి చేస్తా. "

- అమీ శాటర్త్‌ వైట్‌, న్యూజిలాండ్​ వైస్ కెప్టెన్.

ఈ బాధ్యతలు చేపట్టడం ఎంతో సంతోషంగా ఉందన్నారు సోఫీ-అమీ. వచ్చే ఏడాది జరగబోయే ఐసీసీ మహిళా ప్రపంచకప్​లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ఇది చూడండి : ఈ పాపే జూనియర్​ ​బోల్ట్ 'లైట్నింగ్' ​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.