వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో ఘనవిజయాన్ని కైవసం చేసుకుంది న్యూజిలాండ్. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 519 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఓపెనర్ లాథమ్ 86 పరుగులతో రాణించగా, సారథి విలియమ్సన్ (251) డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. చివర్లో జేమిసన్ 51 పరుగులతో నిలవగా, కివీస్ 519 పరుగుల భారీ స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. విండీస్ బౌలర్లలో రోచ్ 3, గేబ్రియల్ 3, అల్జారీ జోసెఫ్ 1 వికట్ దక్కించుకున్నారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 138 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్లు బ్రాత్‌వైట్ (21), క్యాంప్‌బెల్ (26) కుదురుకుంటున్న సమయంలో ఈ జోడీ పెవిలియన్ చేరింది. తర్వాత ఎవరూ ఆకట్టుకోకపోవడం వల్ల తక్కువ స్కోర్‌కే పరిమితమైంది విండీస్.
-
WAGNER WICKET to close out a Test victory at Seddon Park! 🔥
— BLACKCAPS (@BLACKCAPS) December 6, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Lovely coverage throughout the Test on @sparknzsport #NZvWI #CricketNation pic.twitter.com/ezx7Z5cijk
">WAGNER WICKET to close out a Test victory at Seddon Park! 🔥
— BLACKCAPS (@BLACKCAPS) December 6, 2020
Lovely coverage throughout the Test on @sparknzsport #NZvWI #CricketNation pic.twitter.com/ezx7Z5cijkWAGNER WICKET to close out a Test victory at Seddon Park! 🔥
— BLACKCAPS (@BLACKCAPS) December 6, 2020
Lovely coverage throughout the Test on @sparknzsport #NZvWI #CricketNation pic.twitter.com/ezx7Z5cijk
ఫాలోఆన్
తర్వాత ఫాలో ఆన్ ఆడిన విండీస్ రెండో ఇన్నింగ్స్‌లోనూ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ బ్లాక్‌వుడ్ (104) కెరీర్లో రెండో టెస్టు సెంచరీకి తోడు, అల్జారీ జోసెఫ్ 86 పరుగులతో రాణించినా మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమవడం వల్ల 247 పరుగులకే ఆలౌటై 134 పరుగుల తేడాతో కివీస్ చేతిలో పరాజయంపాలైంది.