ETV Bharat / sports

డే/నైట్​ టెస్టు కోసం మొతెరాలో ఎల్​ఈడీ లైట్లు - డే/నైట్​ టెస్టు

ఇంగ్లాండ్​, భారత్​ మధ్య జరగనున్న డే/నైట్​ టెస్టు కోసం మొతెరా స్టేడియంలో అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. స్టేడియంలో నీడలు పడకుండా పైనుంచి వచ్చే బంతిని సులభంగా గుర్తించేందుకు కొత్తగా ఎల్​ఈడీ ఫ్లడ్​లైట్లను అమర్చారు. ఈ నెల 24న డే/నైట్​ టెస్టు ప్రారంభం కానుంది.

Motera Stadium
డే/నైట్​ టెస్టు కోసం మొతెరాలో ఎల్​ఈడీ లైట్లు
author img

By

Published : Feb 17, 2021, 11:59 PM IST

మొతెరా స్టేడియంలో నీడలు పడకుండా, పైనుంచి వచ్చే బంతిని సులభంగా గుర్తించేలా కొత్తగా ఎల్‌ఈడీ ఫ్లడ్‌లైట్లను ఏర్పాటు చేశామని గుజరాత్‌ క్రికెట్ ‌సంఘం సంయుక్త కార్యదర్శి అనిల్‌ పటేల్‌ అన్నారు. ఇంగ్లాండ్‌, భారత్‌ మధ్య ఫిబ్రవరి 24న మొదలయ్యే డే/నైట్‌ టెస్టుకోసం ఇలా చేశామని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియమైన ఇక్కడ 11 సెంటర్‌ పిచ్‌లు ఉన్నాయని మరెక్కడా ఇలాంటి వసతులు లేవని వెల్లడించారు. జిమ్‌లు కలిగిన నాలుగు డ్రెస్సింగ్ రూమ్‌లు ఉన్నాయని తెలిపారు.

ఒకే రకమైన మట్టితో..

మొతెరాలోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ స్టేడియాన్ని కొన్నాళ్ల క్రితమే పూర్తిగా నవీనీకరించారు. తొలుత ఇక్కడ మోదీ, ట్రంప్‌ సభ నిర్వహించారు. ఈ మధ్యే సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 ట్రోఫీ నాకౌట్‌ మ్యాచులు జరిగాయి. సాధన పిచ్‌లు, సెంటర్‌ పిచ్‌లను ఒకే రకమైన మట్టితో రూపొందించిన స్టేడియం ప్రపంచంలో ఇదొక్కటేనని పటేల్‌ తెలిపారు. బంతి స్పష్టంగా కనిపించేందుకు, నీడలను పరిహరించేందుకు మాస్ట్‌ లైట్ల బదులు స్టేడియం పైకప్పు చుట్టూ ఎల్‌ఈడీ బుగ్గలు ఏర్పాటు చేశామన్నారు. ఇక్కడి అధునాతన మురుగునీటి పారుదల వ్యవస్థతో భారీ వర్షం వచ్చినా నిమిషాల వ్యవధిలో మైదానం సిద్ధమవుతుందని వెల్లడించారు.

వర్షంతో ఏ ఇబ్బందీ లేదు..

'పచ్చిక కింద పొరగా ఇసుకను వాడాం. దాంతో పాటు అధునాతన మురుగునీటి పారుదల వ్యవస్థతో చాలా వేగంగా వరద నీరు బయటకు వెళ్లిపోతుంది. 8 సెంటీమీటర్ల వర్షం కురిసినా ఇబ్బంది లేదు. మ్యాచులు రద్దయ్యే పరిస్థితి ఉండదు' అని పటేల్‌ తెలిపారు. 63 ఎకరాల్లో నిర్మించిన మొతెరా స్టేడియంలో బౌలింగ్‌ యంత్రాలతో కూడిన 6 ఇండోర్‌ పిచ్‌లు ఉన్నాయి. చిన్న పెవిలియన్‌ గల రెండు ఔట్‌డోర్‌ పిచ్‌లు, రెండు ప్రాక్టీస్‌ పిచ్‌లు ఉన్నాయి. ఇక స్టేడియం క్లబ్‌హౌజ్‌లో 50 డీలక్స్‌ రూమ్‌లు, ఐదు సూట్‌లు ఉన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.