ETV Bharat / sports

'అందుకు నా మనసు అంగీకరించలేదు' - final

వరల్డ్​కప్ ఫైనల్లో ఓవర్ త్రో ద్వారా వచ్చిన 4 అదనపు పరుగులు రద్దు చేయమని అంపైర్లను అడగాలనుకోలేదని, అందుకు తన మనసు అంగీకరించలేదని చెప్పాడు ఇంగ్లాండ్​ క్రికెటర్​ బెన్ స్టోక్స్​.

స్టోక్స్
author img

By

Published : Jul 31, 2019, 1:20 PM IST

ప్రపంచకప్​-2019 ఫైనల్ మ్యాచ్ ఆఖర్లో గప్తిల్​ 'ఓవర్​ త్రో'ను అంత త్వరగా మర్చిపోలేం. ఒక విధంగా ఇంగ్లాండ్​ను విశ్వవిజేతగా నిలిచేలా చేసింది ఆ నాలుగు పరుగులే. ఈ అదనపు పరుగులపై పెద్ద చర్చే జరిగింది. తాజాగా ఇంగ్లీష్ ఆటగాడు బెన్ స్టోక్స్ ఈ అంశంపై స్పందించాడు. ఓవర్​ త్రోలో వచ్చిన నాలుగు పరుగులను రద్దు చేయమని అంపైర్లను అడగాలనుకోలేదని చెప్పాడు.

"అక్కడ జరిగిన సంఘటన మొత్తం చూశా. 'పరుగులు రద్దు చేయమని అడగాలా' అని నన్ను నేను ప్రశ్నించుకున్నా. కానీ నా మనసు అందుకు అంగీకరించలేదు. అంపైర్లను అడగలేదు".

-బెన్ స్టోక్స్​, ఇంగ్లాండ్ క్రికెటర్​.

సూపర్ ఓవర్​కు ముందు కేన్ విలియమ్స​న్​ను క్షమించమని అడిగానని చెప్పాడు స్టోక్స్​.

"మ్యాచ్​ టైగా ముగిసిన తర్వాత సూపర్​ ఓవర్​కు ముందు టామ్​ లాథమ్​ దగ్గరకు వెళ్లి క్షమించమని అడిగా. విలియమ్సన్​ వైపు చూసి మన్నించమన్నా' . -బెన్ స్టోక్స్​, ఇంగ్లాండ్ క్రికెటర్​

అసలేం జరిగింది?

మెగాటోర్నీ ఫైనల్​ చివరి ఓవర్లో కివీస్ ఆటగాడు గప్తిల్ వేసిన ఓవర్​ త్రో కారణంగా బంతి బెన్ స్టోక్స్​ బ్యాట్​ను తాకి బౌండరీ వెళ్లింది. ఈ కారణంగా అదనంగా నాలుగు పరుగులు ప్రకటించాడు అంపైర్​ ధర్మసేన. అప్పటికీ రెండో పరుగు పూర్తి చేస్తోన్న స్టోక్స్ ఖాతాలో ఆరు పరుగులు చేరాయి. సూపర్​ ఓవర్లోనూ ఇరు జట్ల స్కోర్లు సమం అయ్యాయి. ఫలితంగా బౌండరీ కౌంట్ ద్వారా ఇంగ్లాండ్ విశ్వవిజేతగా నిలిచింది.

ఇది చదవండి: విచిత్ర బౌలింగ్ యాక్షన్​.. నెట్టింట వైరల్​

Intro:Body:

sf

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.