అపార నైపుణ్యంతో, ఆకట్టుకునే ప్రదర్శనతో టీమిండియా యాజమాన్యం దృష్టిలో పడ్డాడు భారత వర్ధమాన బౌలర్ నవదీప్ సైని. టీ-20లో సత్తాచాటిన ఇతడిని వెస్టిండీస్ టెస్టు సిరీస్‌లో కొనసాగించనున్నారు. ప్రధాన నెట్ బౌలర్‌గా జట్టుతో పాటే ఉండనున్నాడు సైనీ.
"విండీస్ టెస్టు సిరీస్ కోసం.. నవదీప్ సైనిని ఇక్కడే ఉంచాం. టీమిండియా యాజమాన్యం సలహా మేరకు అతడిని నెట్ బౌలర్‌గా కొనసాగించనున్నాం. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని టెస్టు ఫార్మాట్లో అతడిపై దృష్టి పెట్టనున్నాం" -బీసీసీఐ ప్రతినిధి
ఇటీవల జరిగిన ప్రపంచకప్‌లోనూ సైని నెట్ ప్రాక్టీస్ ఆటగాళ్లకు బౌలింగ్ చేశాడు. వెస్టిండీస్-ఏతో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్‌లోనూ ఆరు ఓవర్లు బౌలింగ్ చేశాడు.
ఇప్పటికే టీ-20 సిరీస్‌లో సత్తాచాటిన నవదీప్ సైనిని భవిష్యత్తులో టెస్టు ఫార్మాట్లోకి తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. గత కొద్దిరోజులగా ఎర్రబంతి క్రికెట్లో నిలకడగా రాణిస్తున్నాడు సైని. స్థిరమైన పేస్, వికెట్లు తీసే నైపుణ్యంతో అందరిని ఆకర్షిస్తున్నాడు.
ఇది చదవండి: యాషెస్ మూడో టెస్టుకు అదే ఇంగ్లాండ్ జట్టు