ETV Bharat / sports

నటరాజన్​ రికార్డు.. ఒకేసారి మూడింటిలో

తమిళనాడు యువ పేసర్ నటరాజన్ అంతర్జాతీయ క్రికెట్​లో అద్భుత రికార్డు సొంతం చేసుకున్నాడు. ఒకే సిరీస్​ ద్వారా మూడు ఫార్మాట్లలోనూ అరంగేట్రం చేసిన ఆటగాడిగా నిలిచాడు.

author img

By

Published : Jan 15, 2021, 3:11 PM IST

Natarajan becomes first Indian to make international debut in 3 formats on same tour
నటరాజన్​ రికార్డు.. ఒకేసారి మూడింటిలో

టీమ్​ఇండియా యువ బౌలర్ నటరాజన్‌ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. ఒకే పర్యటనలో మూడు ఫార్మాట్లలో ఆరంగేట్రం చేసిన తొలి అంతర్జాతీయ క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా భారత జట్టు నెట్‌ బౌలర్‌గా ఎంపికైన నట్టు.. మిగతా జట్టు సభ్యుల్లో కొందరికి గాయాలు కావడం వల్ల అనూహ్యంగా మూడు ఫార్మాట్లలో చోటు దక్కించుకున్నాడు. అనుకోకుండా ఎంపికైనా మూడు ఫార్మాట్లలోనూ నటరాజన్‌ సత్తా చాటాడు.

డిసెంబర్‌ 2న ఆస్ట్రేలియాతో మూడో వన్డేతో అంతర్జాతీయ క్రికెట్​లోకి ఎంట్రీ ఇచ్చిన నటరాజన్‌ రెండు వికెట్లు తీశాడు. అనంతరం టీ20 సిరీస్​ను టీమ్​ఇండియా 2-1 తేడాతో గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. మొత్తంగా మూడు మ్యాచ్​లాడి 10 వికెట్లు తీశాడు. ఇప్పుడు బుమ్రాకు గాయం కావడం వల్ల నాలుగు టెస్టుతో ఈ ఫార్మాట్​లోకి అరంగేట్రం చేశాడు. తొలిరోజు రెండు వికెట్లు తీసి తనపై మేనేజ్​మెంట్​ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాడు.

ఇది చదవండి: బ్రిస్బేన్ టెస్టు: తొలి రోజు ఆటలో ఆస్ట్రేలియా 274/5

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.