ETV Bharat / sports

టీమిండియాతో తలపడే విండీస్​ టీ20 జట్టిదే - Narine, Pollard recalled for first T20 Internationals against India

టీమిండియాతో జరగనున్న టీ20 సిరీస్​లో భాగంగా రెండు టీ20లకు జట్టును ప్రకటించింది వెస్టిండీస్. మొత్తం 14 మందితో కూడిన జట్టులో సీనియర్ ఆటగాళ్లు పొలార్డ్​, సునీల్ నరేన్​లకు చోటు లభించింది.

మ్యాచ్
author img

By

Published : Jul 23, 2019, 11:55 AM IST

Updated : Jul 23, 2019, 4:56 PM IST

కోహ్లీసేన విండీస్ పర్యటన ఆగస్టు 3న ప్రారంభంకానుంది. మొదటగా మూడు టీ20లు జరగనున్నాయి. ఇందులో రెండు టీ20లు ఆగస్టు 3, 4న అమెరికాలోని ఫ్లోరిడాలో జరుగుతాయి. ఈ రెండు మ్యాచ్​లకు మాత్రమే జట్టును ప్రకటించింది విండీస్ క్రికెట్ బోర్డు. మూడో మ్యాచ్​కు మార్పులుంటాయని తెలిపింది.

టీ20లకు బ్రాత్​వైట్ సారథ్యం వహించనున్నాడు. ఇతడితో పాటు మొత్తం 14 మందితో కూడిన జట్టును ప్రకటించారు సెలక్టర్లు. సీనియర్ ప్లేయర్లు పొలార్డ్, సునీల్ నరేన్​లకు స్థానం లభించింది. ఇప్పటివరకు అంతర్జాతీయ మ్యాచ్ ఆడని ఆంథోనీ బ్రాంబ్లేకు చోటు దక్కింది.

ప్రపంచకప్​లో గాయపడ్డ ఆల్​రౌండర్​ రసెల్​కు టీ20 జట్టులో అవకాశం లభించింది. గాయానికి చికిత్స తీసుకున్న రసెల్​ ప్రస్తుతం ఫిట్​నెస్​పై దృష్టిసారించాడు. విధ్వంసకర ఓపెనర్​ గేల్ ఈ సిరీస్​కు అందుబాటులో ఉండటం లేదు. కెనడాలో జరిగే గ్లోబల్​ టీ20లో పాల్గొనేందుకు ముందే అంగీకారం తెలపడమే కారణం. ఇతడి స్థానంలో జాన్ క్యాంప్​బెల్​కు స్థానం దక్కింది.

Narine, Pollard
విండీస్ జట్టు

వెస్టిండీస్ జట్టు

బ్రాత్​వైట్ (సారథి), సునీల్ నరైన్, కీమో పాల్, కారీ పియరే, పొలార్డ్, నికోలస్ పూరన్ (కీపర్), రావ్​మన్ పావెల్, రసెల్, ఒషానే థామస్, ఆంథోనీ బ్రాంబ్లే (కీపర్), జాన్ క్యాంప్​బెల్, షెల్డన్ కాట్రెల్, హెట్​మియర్, ఎవిన్ లూయిస్

ఇవీ చూడండి.. కరీబియన్లపై భారత్​ యువజట్టు ప్రదర్శన అదుర్స్

Intro:Body:

P

Conclusion:
Last Updated : Jul 23, 2019, 4:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.