చెన్నై సూపర్‌కింగ్స్‌లో నమ్మకానికి ఎక్కువ ప్రాధాన్యమిస్తామని ఆ జట్టు యజమాని ఎన్.శ్రీనివాసన్ అంటున్నారు. తమ సారథి ఎంఎస్ ధోనీ ఆటను సీరియస్‌గా తీసుకున్నాడని పేర్కొన్నారు. సీఎస్‌కేకు విజయాలను అందించాలన్న కసి అతడిలో కనిపిస్తోందని వెల్లడించారు. అందుకే భారత జట్టుకు వీడ్కోలు పలికినప్పటికీ సారథిగా కొనసాగిస్తున్నామని వివరించారు.
"ఎంఎస్ ధోనీ చెన్నైలోనే ఉన్నాడు. క్రికెట్‌ను సీరియస్‌గా తీసుకున్నాడు. ఉదయం ఇండోర్లో, సాయంత్రం చెపాక్‌లో సాధన చేస్తున్నాడు. మాలాగే అతడికీ అంకితభావం చాలా ఎక్కువ. మరో విషయం ఏంటంటే క్రికెట్లో గెలవడమే ముఖ్యం. ఐపీఎల్ సైతం అంతే. అయితే నిలకడ, నమ్మకం వంటివీ కీలకమే."
-- శ్రీనివాసన్, సీఎస్కే యజమాని.
కొన్నేళ్లనుంచి తాము క్రికెట్‌కు సేవచేస్తున్నట్లు శ్రీనివాసన్ తెలిపారు. 'దాదాపుగా 50 ఏళ్ల నుంచి మేం క్రికెట్లో ఉన్నాం. 1960 నుంచి తమిళనాడు క్రికెటర్లు మొత్తం మా వద్ద ఉద్యోగులే. అందుకే మేం సుదీర్ఘ కాలంగా క్రికెట్లో ఉన్నాం. జట్లను నడుపుతున్నాం. మంచి క్రికెట్‌ను కొనసాగిస్తాం' అని వెల్లడించారు.
గతేడాది ఐపీఎల్ సీజన్‌లో చెన్నై పేలవంగా ఆడింది. తొలిసారి ప్లేఆఫ్స్‌కు వెళ్లకుండా వెనుదిరిగింది. జట్టులో సమతూకం కొరవడింది. సీనియర్లు కొందరు సీజన్లో పాల్గొనలేదు. జూనియర్లకు మొదట్లో అవకాశాలు ఇవ్వలేదు. దాంతో జట్టు ఎక్కువగా ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలో జరిగిన వేలంలో మొయిన్ అలీ (రూ.7 కోట్లు), కృష్ణప్ప గౌతమ్ (రూ.9.25 కోట్లు)ను భారీ ధర పెట్టి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇక సురేశ్ రైనా తిరిగి జట్టులో చేరాడు. రాబిన్ ఉతప్పను రాజస్థాన్ నుంచి బదిలీ చేసుకున్నారు.
ఇదీ చదవండి:డోప్ టెస్టుల్లో ఇద్దరు ఒలింపిక్స్ అథ్లెట్లు విఫలం