ETV Bharat / sports

వన్డేల్లో రీఎంట్రీ ఇవ్వడం పక్కా: రహానె

వన్డే జట్టులో తిరిగి చోటు సంపాదిస్తానని ధీమా వ్యక్తం చేశాడు టీమ్​ఇండియా క్రికెటర్​ అజింక్యా రహానె. అందుకోసం మానసికంగా సన్నద్ధమవుతున్నట్లు తెలిపాడు.

rahane
రహానె
author img

By

Published : Jul 11, 2020, 6:43 PM IST

వన్డేల్లో రీఎంట్రీ ఇస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు భారత క్రికెటర్​ అజింక్యా రహానె. మూడు ఫార్మాట్లోనూ తన సత్తా నిరూపించుకోవడం కోసం మానసికంగా సన్నద్ధమవుతున్నట్లు తెలిపాడు.

"వన్డేల్లో ఓపెనింగ్​ లేదా నెం.4 స్థానంలో ఆడటానికి సిద్ధంగా ఉన్నాను. ఈ ఫార్మాట్​లోకి రీఎంట్రీ ఇస్తాననే పూర్తి విశ్వాసం ఉంది. కానీ అవకాశం ఎప్పుడు వస్తుందో తెలియదు. అన్ని ఫార్మాట్లలోనూ బాగా రాణించేందుకు మానసికంగా సిద్ధమవుతున్నాను. సానుకూల దృక్పథం, సామర్థ్యం మెరుగుపర్చుకోవడంతోనే మన గురించి మనకు తెలుస్తుంది"

-రహానె, భారత క్రికెటర్​.

ప్రస్తుతం వన్డేల్లో నెం.4 స్థానంలో ముంబయి ఆటగాడు ​శ్రేయస్​ అయ్యర్​ ఆడుతున్నాడు. ఓపెనింగ్​లో రోహిత్​ శర్మ, శిఖర్​ ధావన్​ భాగస్వామ్యం, మూడో స్థానంలో కోహ్లీ ఉన్నారు.

మొత్తంగా కెరీర్​లో 65 టెస్టులు ఆడాడు రహానె. అయితే వన్డేల్లో ప్రస్తుతం చోటే లేకపోగా.. దాదాపు నాలుగేళ్ల నుంచి టీ20 జట్టుకు దూరంగా ఉన్నాడు.

ఇది చూడండి : "ధోనీ నమ్మితే జట్టులో చోటు దక్కినట్లే"

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.