ETV Bharat / sports

జనవరి నుంచి దేశవాళీ పోరు.. మొదటగా ఆ టోర్నీనే - ముస్తాక్ అలీ ట్రోఫీ టీ20

దేశవాళీ టోర్నీల నిర్వహణకు భారత క్రికెట్ బోర్డు సిద్ధమైంది. ఈ క్రమంలోనే మొదట, జనవరిలో ముస్తాక్ అలీ టీ20 టోర్నీ నిర్వహించనుంది. అందుకోసం బయో బబుల్స్​ను ఏర్పాటు చేస్తోంది.

Mushtaq Ali T20 tourney to begin from January in six states declares BCCI
జనవరి నుంచి దేశవాళీ పోరు.. మొదటగా ఆ టోర్నీనే
author img

By

Published : Dec 13, 2020, 6:12 PM IST

Updated : Dec 13, 2020, 8:23 PM IST

కరోనా ప్రభావంతో మార్చి నుంచి దేశవాళీ టోర్నీలను నిర్వహించని బీసీసీఐ.. వచ్చే జనవరి 10 నుంచి 31 వరకు ముస్తాక్​ అలీ ట్రోఫీ జరపనున్నట్లు తెలిపింది. ఇందుకోసం ఆరు రాష్ట్రాల్లో బయో బబుల్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. జనవరి 2 కల్లా టోర్నీలో పాల్గొనే జట్లు సంబంధిత హబ్​లకు చేరుకుంటాయని చెప్పింది. రంజీల నిర్వహణపై ఇంకా స్పష్టతనివ్వలేదు.

"వివిధ రాష్ట్రాల క్రికెట్​ బోర్డుల అభిప్రాయల ప్రకారం బీసీసీఐ తుది నిర్ణయానికి వచ్చింది. 2020-21 దేశవాళీ సీజన్​లో భాగంగా ముస్తాక్​ అలీ టీ20 టోర్నీ జరిపేందుకు సిద్ధమైంది. ఈ టోర్నీ అనంతంరం విజయ్​ హజారే, రంజీలపై నిర్ణయం తీసుకుంటాం"

-జై షా, బీసీసీఐ సెక్రటరీ

వచ్చే ఐపీఎల్​లో దాదాపు 10 టీమ్​లు ఉంటాయని భావిస్తోన్న బీసీసీఐ.. ఈ ముస్తాక్​ అలీ టోర్నీకి సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీని తర్వాత రంజీ ట్రోఫీ నిర్వహణకే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి.

ఇదీ చదవండి: వార్మప్ మ్యాచ్​ డ్రా.. తొలి టెస్టుకు కోహ్లీసేన సిద్ధం!

Last Updated : Dec 13, 2020, 8:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.