దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్, మాజీ కెప్టెన్ కుమార సంగక్కరను సలహా కమిటీ సభ్యులుగా ప్రకటించింది శ్రీలంక క్రికెట్. మొత్తంగా సాంకేతిక సలహా కమిటీకి నలుగురు సభ్యులను ఎంపిక చేసినట్లు తెలిపింది.
శ్రీలంక క్రీడా మంత్రి నమల్ రాజపక్స ఆదేశాల మేరకు మాజీ బ్యాట్స్మన్ అరవింద డి సిల్వాను సలహా కమిటీ అధ్యక్షుడిగా నియమించింది శ్రీలంక క్రికెట్. మాజీ బ్యాట్స్మన్, ఐసీసీ మ్యాచ్ రిఫరీ రోషన్ మహానమాను కూడా కమిటీలో సభ్యుడిగా ఎంపిక చేసింది.
సొంత గడ్డపై ఇంగ్లాండ్తో రెండు టెస్ట్ సిరీస్లలో ఓటమిపాలైన నేపథ్యంలో సలహా కమిటీ నూతన సభ్యులను నియమించింది శ్రీలంక క్రికెట్. ఇందుకోసం పలుమార్లు క్రీడామంత్రితో చర్చలు జరిపింది.
ఇదీ చదవండి:'అది టీమ్ఇండియా అర్థరహిత నిర్ణయం'