బెంగళూరుతో మ్యాచ్‌లో టాస్ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగుల స్కోర్ సాధించింది. ఓపెనర్లు రోహిత్, డికాక్ మంచి ఆరంభన్నిచ్చారు. వీరి ధాటికి మొదటి 6 ఓవర్లలో 52 పరుగులు వచ్చాయి. అనంతరం డికాక్ (23) అవుటయ్యాడు. రోహిత్ కాసేపు బ్యాట్‌కి పనిచెప్పినా 48 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పెవిలియన్ బాట పట్టాడు.
చాహల్ బౌలింగ్‌లో మూడు బంతుల్లో మూడు సిక్సులు కొట్టి ఊపు మీద కనిపించిన యువరాజ్ (23) మరో భారీ షాట్‌కి ప్రయత్నించి వెనుదిరిగాడు. సూర్యకుమార్ యాదవ్ (38) ఆకట్టుకున్నాడు. కృనాల్ పాండ్య, పొలార్డ్ విఫలమయ్యారు. చివర్లో పాండ్యా(31) మెరుపులతో స్కోర్ 187 పరుగులకు చేరింది.
బెంగళూరు బౌలర్లలో చాహల్ నాలుగు వికెట్లు దక్కించుకోగా, ఉమేష్, సిరాజ్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.
ఇవీ చూడండి..ముంబయి ఇండియన్స్ జట్టులో మరో కొత్త బౌలర్