ETV Bharat / sports

'సచిన్​తో మాట్లాడాక నా బ్యాటింగ్​లో మార్పొచ్చింది'

author img

By

Published : Mar 13, 2021, 6:24 AM IST

గతేడాది ఐపీఎల్​తో పాటు ఆస్ట్రేలియా పర్యటనలోనూ విఫలమైన యువ క్రికెటర్​ పృథ్వీ షా.. ప్రస్తుతం జరుగుతోన్న విజయ్ హజారే టోర్నీలో విధ్వంసం సృష్టిస్తున్నాడు. తనదైన ఆటతీరుతో ముంబయి జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. ఇంతలో అంత మార్పు రావడానికి కారణాలను తాజాగా వెల్లడించాడు పృథ్వీ.​

Mumbai captain Prithvi Shah has said that he has changed his style of play following the advice of legendary Sachin Tendulkar.
'సచిన్​తో మాట్లాడాక నా బ్యాటింగ్​లో మార్పొచ్చింది'

దిగ్గజ ఆటగాడు సచిన్​ తెందుల్కర్​ సలహా తర్వాత తన ఆటతీరులో మార్పొచ్చిందని ముంబయి కెప్టెన్ పృథ్వీ షా తెలిపాడు. నిరుడు ఐపీఎల్​లో నిరాశ పరిచిన పృథ్వీ.. ఆస్ట్రేలియా పర్యటనలోనూ విఫలమయ్యాడు. అడిలైడ్​లో జరిగిన తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్​ల్లో కలిపి ఆరు బంతులే ఎదుర్కోవడం వల్ల పృథ్వీకి తర్వాతి టెస్టుల్లో అవకాశం దక్కలేదు. శుభ్​మన్​ గిల్​తో అతడి స్థానాన్ని భర్తీ చేశారు.

2020లో ఘోరంగా విఫలమైన పృథ్వీ.. విజయ్​ హజారే ట్రోఫీ వన్డే క్రికెట్ టోర్నీలో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఇప్పటివరకు ఏడు మ్యాచ్​లాడి, 188.5 సగటుతో 754 పరుగులు సాధించాడు. ఆసీస్​ పర్యటన అనంతరం సచిన్​ను కలవడం తన ఆటలో మార్పునకు కారణమని పృథ్వీ పేర్కొన్నాడు. "నాకంతా గందరగోళంగా అనిపించింది. గల్లీ ప్రాంతంలో నా బ్యాటు కాస్త కిందకి వెళ్తోంది. కానీ కెరీర్​ మొత్తం అలాగే పరుగులు రాబట్టా. నేను ఔటవుతున్న విధానమే అసలు సమస్య. దాన్ని వెంటనే సరిచేయాలి. బ్యాటును సరిగానే ఎత్తుతున్నా గాని దేహానికి కాస్త దూరంగా వెళ్తోంది. దేహానికి బ్యాటును దగ్గరగా ఉంచాలి. ఆ పని చేయలేకపోతున్నా. ఆసీస్ నుంచి రాగానే సచిన్​ సర్​ను కలిశా. బ్యాటింగ్​ శైలిలో ఎక్కువ మార్పులు చేయొద్దన్నాడు. వీలైనంత వరకు దేహానికి దగ్గరగా ఆడమన్నాడు. బంతిని కాస్త ఆలస్యంగా ఆడుతున్నట్లు చెప్పాడు" అని పృథ్వీ వివరించాడు.

ఇదీ చదవండి: 'పిచ్​ సవాళ్లు విసిరింది- షాట్లు ఆడలేకపోయాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.