క్రికెట్లో ఒత్తిడిని ఎదుర్కోవడానికి మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని అనుసరిస్తున్నానని తెలిపాడు క్రికెటర్ సంజు శాంసన్. ధోనీలోని ప్రశాంతత తనను ఎంతగానో ప్రభావితం చేసిందని.. ఆటతీరును మెరుగుపరచుకోవడానికి ఇది మరింతగా ఉపయోగపడుతందని వెల్లడించాడు.
"క్లిష్ట పరిస్థితుల్లోనూ ధోనీ ప్రశాంతత కోల్పోడు. అతడి లక్షణాలను అనుసరించి నేను కూడా బ్యాటింగ్, కీపింగ్‌లో మరింతగా రాణించాలని అనుకుంటున్నా. మీరు గమనించినట్లైతే ప్రతి వికెట్ కీపర్ జట్టులో టాప్ బ్యాట్స్‌మెన్‌గా ఉంటాడు. ఆడమ్ గిల్‌క్రిస్ట్ ఓపెనర్‌గా, ధోనీ మిడిలార్డర్లో బరిలో దిగినా.. ఆట స్వభావాన్నే పూర్తిగా మార్చేశారు. కీపర్ టాప్ లేదా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అయితే.. జట్టులో మరో అదనపు బౌలర్ లేదా ఆల్‌రౌండర్‌ను తీసుకోవచ్చు".
- సంజు శాంసన్, టీమ్ఇండియా క్రికెటర్
2015లో వికెట్ కీపర్‌గా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన శాంసన్.. జాతీయ జట్టులో స్థానాన్ని పదిలం చేసుకోవడానికి ఇప్పటికీ కష్టపడుతున్నాడు. ఈ ఏడాది జనవరిలో కివీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో చోటు లభించినా.. పేలవ ప్రదర్శన చేసి ఆకట్టుకోలేక పోయాడు.
ఇదీ చూడండి... ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు ఆమిర్, సోహైల్ దూరం