భారత కెప్టెన్‌గానే కాక ఐపీఎల్‌లోనూ అదరగొట్టిన ధోనీ.. ప్రపంచవ్యాప్తంగా చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. లీగ్‌లో ఎక్కువ పారితోషికం తీసుకున్న కెప్టెన్లలో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను వెనక్కు నెట్టేశాడు.
"ధోనీ ఐపీఎల్ ద్వారా మొత్తంగా రూ.137 కోట్లు సంపాదించాడు. గత మూడు సీజన్లలో దాదాపు రూ.45 కోట్లు అందుకున్నాడు. 2014-15లో రూ.12.5 కోట్లు, 2011 నుంచి 2013 వరకు ప్రతి ఏడాదికి రూ.8.2 కోట్ల పారితోషికం పుచ్చుకున్నాడు. కెరీర్ ప్రారంభంలో 1.5 మిలియన్ డాలర్లు తీసుకున్నాడు" అని ఇన్సైడ్ స్పోర్ట్స్ మనీ బిల్ నివేదికలో వెల్లడించింది.
విరాట్, రోహిత్ ఇలా....
కెరీర్ ప్రారంభంలో డెక్కన్ ఛార్జర్స్ తరపున ఆడిన రోహిత్ శర్మ.. తొలుత రూ.3 కోట్లు తీసుకున్నాడు. 2011-13 వరకు ఏడాదికి రూ.9.2 కోట్లు అందుకున్నాడు. తర్వాత నుంచి ధోనీతో సమంగా ఏడాదికి రూ.15 కోట్లు సంపాదించాడు. మొత్తంగా రోహిత్ ఐపీఎల్‌తో రూ. 131 కోట్లు సంపాదించాడు.
రోహిత్ తర్వాత స్థానంలో ఉన్న కోహ్లీ రూ. 126 కోట్లు ఆర్జించాడు. 2017లో అధికంగా కోహ్లీనే రూ. 17 కోట్లు తీసుకోవడం విశేషం.
ఇదీ చదవండి:భారత్ పర్యటనకు ఇంగ్లాండ్.. 'మోతేరా'లో డే/నైట్ టెస్టు