టీమిండియా మాజీ సారథి ధోనీ బాలీవుడ్‌లో సినిమాలు రూపొందించనున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. త్వరలోనే మహీ సొంతంగా ఓ బ్యానర్‌ను స్థాపించి నిర్మాతగా సినిమాలు తీయాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం... ధోనీకి మంచి స్నేహితుడు. అతడితో కలిసి కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాల్ని నిర్మించాలని ధోనీ భావిస్తున్నాడట. వీరిద్దరి భాగస్వామ్య వెంచర్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి.
సెప్టెంబర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగే మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు జట్టును ప్రకటించింది సెలెక్షన్ కమిటీ. ఇందులో ధోనీకి చోటు దక్కలేదు. భవిష్యత్తు ప్రణాళికల్లో భాగంగా యువ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్‌కు ఎక్కువ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో మహీకి సెలక్టర్లు అవకాశం కల్పించలేదని సమాచారం.
ఇవీ చూడండి.. యాషెస్ మొత్తానికి దూరమైన అండర్సన్