ETV Bharat / sports

'ధోనీ సూచనతోనే కీలక ఇన్నింగ్స్​ ఆడగలిగా' - jadeja follows dhoni tricks

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో తాను అద్భుత ప్రదర్శన చేయడానికి భారత మాజీ కెప్టెన్ ధోనీ సూచన ఉపయోగపడిందని చెప్పాడు ఆల్​రౌండర్ రవీంద్ర జడేజా. మ్యాచ్​ను చివరి ఓవర్​ వరకు తీసుకెళ్లగలిగితే విలువైన పరుగులు చేయొచ్చని మహీ తనతో చెప్పినట్లు వెల్లడించాడు.

MS Dhoni
ధోనీ
author img

By

Published : Dec 3, 2020, 3:00 PM IST

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో తాను కీలక ఇన్నింగ్స్​ ఆడటంలో భారత మాజీ కెప్టెన్ ధోనీ వ్యూహం దోహదపడిందని చెప్పాడు రవీంద్ర జడేజా. తన బ్యాటింగ్‌ మెరుగుపడటానికి ప్రధాన కారణం మహీనే అని తెలిపాడు.

"ధోనీ సుదీర్ఘకాలం టీమ్​ఇండియా, చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు ఆడాడు. అతను తొలుత భాగస్వామ్యం నిర్మించేందుకు ప్రాధాన్యం ఇచ్చి.. క్రీజులో కుదుటపడ్డాక భారీ షాట్లు ఆడతాడు. మహీ బ్యాటింగ్‌ను నేను ఎన్నోసార్లు చూశా.. అతనితో కలిసి ఆడా. మ్యాచ్‌ను చివరి ఓవర్ వరకు తీసుకెళ్లగలిగితే.. ఆఖరి 4-5 ఓవర్లలో భారీగా పరుగులు సాధించవచ్చని చెప్పేవాడు. అదే వ్యూహాన్ని హార్దిక్​తో కలిసి మూడో వన్డేలో అమలు చేశా."

-రవీంద్ర జడేజా, టీమ్​ఇండియా క్రికెటర్​.

ఈ మ్యాచ్​లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్​ ఆచితూచి ఆడింది. కానీ వెంటవెంటనే శిఖర్ ధావన్(16), శుభ్​మన్ గిల్(33), కోహ్లీ(63), శ్రేయస్ అయ్యర్(19), కేఎల్ రాహుల్(5) వికెట్లను కోల్పోయింది. అదే సమయంలో చివర్లో వచ్చిన హార్దిక్ పాండ్యా(92*), రవీంద్ర జడేజా(66*) వీర విహారం చేశారు. చూడచక్కని షాట్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఆస్ట్రేలియా ముందు 303 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు. అనంతరం కంగారూ జట్టు 289 పరుగులకు ఆలౌటై ఓటమి మూటగట్టుకుంది. ఈ సుదీర్ఘ పర్యటనలో భారత్​-ఆసీస్​ ఇంకా మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడాల్సి ఉంది. డిసెంబర్​ 4న తొలి టీ20 జరగనుంది.

ఇదీ చూడండి : 'టీ-20 సిరీస్​కు ముందు గెలుపు ఉత్సాహాన్నిచ్చింది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.