ఇటీవల ధోనీ సైనిక విధుల్లో ఉన్నప్పుడు అతడి కోసం భార్య సాక్షి సింగ్ ఓ కొత్త వాహనాన్ని కొనుగోలు చేసింది. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆ ఫొటోలను పంచుకుంది. తాజాగా ఈ రెడ్ బీస్ట్.. జీప్ చెరోకి ట్రాక్హక్ ఎస్యూవీని తొలిసారి నడుపుతూ అభిమానుల కంటపడ్డాడు మహీ. వెంటనే ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమయ్యాయి.
బైకులన్నా, కార్లన్నా ధోనీకి విపరీతమైన ఇష్టం. ఇప్పటికే అతడి వద్ద ఫెరారీ 599 జీటీఓ, హమ్మర్ హెచ్2, జీఎంసీ సీరా లాంటి కార్లు ఉన్నాయి. కవాసకి నింజా హెచ్ 2, కాన్ఫిడరేట్ హెల్కట్, బీఎస్ఏ, సుజుకీ హయాబుసా వంటి బైకులు ఉన్నాయి.
ఇవీ చూడండి.. టీ20 ప్రపంచకప్ కోసం ఇదే మీకు సదవకాశం: ధావన్