టీమ్ఇండియా ప్రముఖ క్రికెటర్లు కోహ్లీ, ధోనీ.. తమ ఆటతీరుతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. వీరిద్దరూ తమ ఆటతో భారీగా అభిమానగణాన్ని పెంచుకున్నారు. ఇటీవలే జరిపిన ఓ సర్వేలో ఈ ఆటగాళ్ల గురించి ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి. ధోనీ వినయపూర్వక వ్యక్తిత్వం కలవాడని.. కోహ్లీ ఫైర్ బ్రాండ్, అందమైన వ్యక్తి అని తేలింది.
ఇండియన్ ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బ్రాండ్స్ (ఐఐహెచ్‌బీ) తొలి అధ్యయనంలో భాగంగా సోషల్‌మీడియాలో అత్యధికంగా అనుచరులు ఉన్న కోహ్లీ.. అందమైన, నిర్భయమైన వ్యక్తిగా నిలిచినట్లు తెలిపింది. టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తిత్వం కలిగినవాడని ఆ సర్వే వెల్లడించింది.
దేశంలోని 23 నగరాల్లో 60వేల మంది అభిప్రాయలను ఈ సర్వేలో సేకరించారు. ఈ నివేదికలో బాలీవుడ్ (69), టెలివిజన్ (67), క్రీడాకారులతో(37) పాటు మరో 187 మంది ప్రముఖులు ఉన్నారు.
అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పటి నుంచి అనేక బ్రాండ్లకు ప్రచారకర్తగా ధోనీ వ్యవహరిస్తున్నాడు.