ETV Bharat / sports

'ప్రపంచకప్​లో బౌలౌట్​ విజయం ధోనీ వల్లే' - Robin Uthappa about MS Dhoni

టీ20 ప్రపంచకప్​-2007లో పాకిస్థాన్​తో జరిగిన లీగ్ మ్యాచ్​లో భారత్ విజయం సాధించింది. అయితే ఈ గెలుపు క్రెడిట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకే దక్కుతుందని తెలిపాడు రాబిన్ ఉతప్ప.

ధోనీ
ధోనీ
author img

By

Published : May 21, 2020, 5:40 AM IST

టీ20 ప్రపంచకప్‌-2007లో విజేతగా నిలిచింది భారత్​. అయితే ఈ టోర్నీ లీగ్‌దశలో పాకిస్థాన్​పై సాధించిన విజయం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అందుకు కారణం బౌలౌట్ విధానం. ఐసీసీ అప్పట్లో ప్రవేశపెట్టిన ఈ విధానం ద్వారా మ్యాచ్​ను చేజిక్కించుకుంది టీమ్​ఇండియా. అయితే ఈ గెలుపునకు ప్రధాన కారణం కెప్టెన్ మహేంద్ర సింగ్​ ధోనీనే అంటున్నాడు ఆ జట్టులో సభ్యుడు రాబిన్ ఉతప్ప.

"ఈ మ్యాచ్ క్రెడిట్ ధోనీకే దక్కుతుంది. అందుకు కారణం ఈ మ్యాచ్​లో బౌలౌట్​ సమయంలో ధోనీ చేసిన కీపింగ్​. పాక్‌ కీపర్‌ కమ్రాన్‌ అక్మల్ రెగ్యులర్‌గా వికెట్ల వెనకాల నిల్చుంటే.. ధోనీ మాత్రం విభిన్నంగా వికెట్ల వెనకాల కూర్చొని ఉన్నాడు. అందువల్ల మేము మహీని లక్ష్యంగా చేసుకుని బౌలింగ్‌ చేసి సులభంగా వికెట్లను పడగొట్టాం. అందుకే ఆ విజయం క్రెడిట్‌ ధోనికే దక్కుతుంది."

-ఉతప్ప, టీమ్​ఇండియా వెటరన్ క్రికెటర్

ఈ మ్యాచ్‌లో భారత్‌-పాక్‌ జట్ల స్కోర్లు సమమయ్యాయి. అంపైర్లు బౌలౌట్‌ విధానం ద్వారా ఫలితాన్ని తేల్చేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం టీమ్​ఇండియా సెహ్వాగ్‌, ఉతప్ప, శ్రీశాంత్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌, హర్భజన్‌ సింగ్‌లను బౌలర్లుగా ఎంచుకుంది. పాకిస్థాన్‌ జట్టు ఉమర్‌ గుల్‌, సొహైల్‌ తన్వీర్‌, అరాఫత్‌, షాహిద్‌ అఫ్రిది, అసిఫ్‌లను తీసుకుంది.

తొలి బంతికే సెహ్వాగ్‌ వికెట్లను గిరాటేయగా, పాక్‌ బౌలర్‌ అరాఫత్‌ గురితప్పాడు. రెండో బంతిని హర్భజన్‌ సింగ్‌ వేయగా అది కూడా వికెట్లను తాకింది. పాక్ నుంచి ఉమర్‌ గుల్‌ వేసిన రెండో బంతి వికెట్లను తాకలేదు. ఉతప్ప మూడో బంతిని బౌల్డ్‌ చేయగా షాహిద్‌ అఫ్రిదీ మిస్సయ్యాడు. ఫలితంగా టీమ్​ఇండియా విజయం సాధించింది

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.