ETV Bharat / sports

ధోనీకి 'పబ్​జీ' పిచ్చి.. నిద్రలోనూ కలవరింత! - నిద్రలోనూ 'పబ్​జీ' గురించి కలవరిస్తున్న ధోనీ

చెన్నై సూపర్​కింగ్స్​తో జరిగిన ఇన్​స్టా లైవ్​లో మాట్లాడిన ధోనీ సతీమణి సాక్షి.. లాక్​డౌన్​ సమయంలో అతడు ఏం చేస్తున్నాడో వెల్లడించింది.

నిద్రలోనూ 'పబ్​జీ' గురించి కలవరిస్తున్న ధోనీ
సాక్షి సింగ్-ధోనీ
author img

By

Published : Jun 1, 2020, 7:56 AM IST

Updated : Jun 1, 2020, 9:28 AM IST

లాక్​డౌన్ వల్ల ఇంట్లోనే ఉన్న టీమ్​ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ.. నిద్రలో పబ్​జీ గురించి కలవరిస్తున్నాడని చెప్పింది అతడి భార్య సాక్షి సింగ్. చెన్నై సూపర్​కింగ్స్​తో తాజాగా జరిగిన ఇన్​స్టాలో లైవ్​లో మాట్లాడుతూ ఈ సంగతి వెల్లడించింది. దీనితో పాటే మహీ గురించి చాలా విషయాలు చెప్పింది.

"మహీ ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాడు. అతడు మెదడుకు విశ్రాంతి లేదు. పబ్​జీ ఆడినప్పుడు, దీని నుంచి అతడి మనసు మళ్లుతుంది. అయితే ఈ మధ్య కాలంలో బెడ్​పై కూడా ధోనీ ఆ గేమ్ గురించే ఆలోచిస్తున్నాడు. నిద్రలోనూ పబ్​జీని కలవరిస్తున్నాడు" -సాక్షి సింగ్, ధోనీ భార్య

అలానే లాక్​డౌన్ సమయాన్ని ధోనీ, తన దగ్గరున్న బైక్​లతో గడుపుతున్నాడని సాక్షి చెప్పింది.

"మహీకి మొత్తం 9బైక్‌లు ఉన్నాయి. వాటికి సంబంధించిన కొత్త విడిభాగాలను కొని, వాటిని అమరుస్తున్నాడు. ఓ బైక్‌ను మొత్తంగా అమర్చాక.. ఓ విడిభాగం మరిచిపోయానని గుర్తించాడు. ఆ తర్వాతి రోజు మళ్లీ మొత్తం బైక్‌ భాగాలను విడదీసి మళ్లీ అమర్చాడు" -సాక్షి సింగ్, ధోనీ భార్య

38 ఏళ్ల ధోనీ చివరగా, గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్​లో కనిపించాడు. ఆ తర్వాత ఆటకు తాత్కాలిక విరామం ప్రకటించాడు. అప్పటి నుంచి మైదానంలో దిగకపోవడం వల్ల అతడి రిటైర్మెంట్​పైనా పలు వార్తలు వస్తున్నాయి. జాతీయ కాంట్రాక్ట్​ నుంచి మహీ పేరు తొలగించడం వీటికి బలం చేకూర్చింది.

TEAM INDIA FORMER CAPTAIN DHONI
టీమ్​ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ

అయితే ఈ ఏడాది ఐపీఎల్​లో చెన్నై సూపర్​కింగ్స్ కెప్టెన్​గా సత్తాచాటి టీమ్​ఇండియాలోకి రావాలని అనుకున్నాడు. కానీ ఉపద్రవంలా వచ్చిన కరోనా ఆ ఆశల్ని తుడిచిపెట్టేసింది. ఈ ప్రాణాంతక మహమ్మారి కారణంగా టోర్నీని నిరవధిక వాయిదా వేశారు. ఈ కారణం వల్ల ధోనీతో సహ ఇతర క్రికెటర్లు ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది.

Last Updated : Jun 1, 2020, 9:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.