ETV Bharat / sports

ధోనీనే ఉత్తమ కెప్టెన్ అంటోన్న రైనా - MS Dhoni is best captain says Suresh Raina

చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీపై ప్రశంసలు కురిపిస్తున్నాడు సహ ఆటగాడు సురేశ్ రైనా. ధోనీ ఇండియాకు ఉత్తమ కెప్టెన్​ అని కితాబిచ్చాడు.

ధోనీ
ధోనీ
author img

By

Published : Feb 14, 2020, 6:02 AM IST

Updated : Mar 1, 2020, 6:54 AM IST

మహేంద్రసింగ్ ధోనీ.. భారత క్రికెట్ చరిత్రలో విజయవంతమైన కెప్టెన్​గా నిలిచిపోయాడు. ఐపీఎల్​లో చెన్నై సూపర్ కింగ్స్​ను మూడు సార్లు విజేతగా నిలిపాడు. తాజాగా ధోనీపై ప్రశంసల జల్లు కురిపించాడు సహచర ఆటగాడు సురేశ్ రైనా. మహీ ఓ ఉత్తమ కెప్టెన్​ అని కొనియాడాడు.

"భారత క్రికెట్​ రూపు రేఖల్ని మార్చిన ధోనీ నాకు తెలిసి ఉత్తమ కెప్టెన్. అలాంటి ఆటగాడు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్​గా ఉండటం ఈ జట్టు అదృష్టం."

-సురేశ్ రైనా, టీమిండియా క్రికెటర్

ఈ ఏడాది చెన్నై సూపర్ మరికొంత మంది కొత్త ఆటాగళ్లలో నూతన కళ సంతరించుకుంది. దీనిపైనా స్పందించాడు రైనా.

"ఈ ఏడాది జట్టులో ప్రతిభ గల కొత్త ఆటగాళ్లు ఉన్నారు. పీయూష్ చావ్లా, హెజిల్ వుడ్, సామ్ కరన్, సాయి కిషోర్​లతో బౌలింగ్ విభాగం పటిష్ఠంగా తయారైంది. జూనియర్, సీనియర్లతో ప్రస్తుతం జట్టు సమతూకంగా ఉంది."

-సురేశ్ రైనా, టీమిండియా క్రికెటర్

ప్రస్తుతం సురేశ్ రైనా కొంత కాలంగా టీమిండియా జట్టులో చోటు సంపాదించలేకపోతున్నాడు. ఐపీఎల్​లో మాత్రం రైనాకు మంచి రికార్డు ఉంది. ఈ సీజన్​లోనూ రాణించి టీ20 ప్రపంచకప్​లో చోటు సంపాదించాలని భావిస్తున్నాడీ సీనియర్ క్రికెటర్.

Last Updated : Mar 1, 2020, 6:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.