ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ.. చెన్నైలో జరిగిన ప్రాక్టీసు క్యాంప్‌లో సిక్సులతో ఇరగదీశాడు. ఓ వైపు మహీ బంతిని స్టాండ్స్‌లో పంపిస్తుంటే పక్కనే ఉన్న రైనా విజిల్స్ వేస్తూ కనిపించాడు. ఆగస్టు 15-20 వరకు ఈ ప్రాక్టీసు సెషన్ జరిగినట్లు తెలుస్తోంది.
-
The super camp sorely missed the super fans, thanks to COVID. But we managed to end it with a loud whistle! #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/z8NoMk7h6p
— Chennai Super Kings (@ChennaiIPL) August 21, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">The super camp sorely missed the super fans, thanks to COVID. But we managed to end it with a loud whistle! #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/z8NoMk7h6p
— Chennai Super Kings (@ChennaiIPL) August 21, 2020The super camp sorely missed the super fans, thanks to COVID. But we managed to end it with a loud whistle! #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/z8NoMk7h6p
— Chennai Super Kings (@ChennaiIPL) August 21, 2020
"ఈ సూపర్ క్యాంప్ సూపర్ ఫ్యాన్స్‌ను చాలా మిస్సయింది. కానీ దీనిని పెద్ద విజిల్‌తో ముగిస్తామని అనుకుంటున్నాం" -చెన్నై సూపర్‌కింగ్స్ ట్వీట్
ఈ ఏడాది ఆగస్టు 15 సాయంత్రం 7:29 గంటలకు ధోనీ రిటైర్మెంట్ ప్రకటించగా, కొద్దినిమిషాల తర్వాత రైనా కూడా క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. రాబోయే ఐపీఎల్ వీరిద్దరూ ఎలా ఆడతారో అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
"నేను అక్కడే ఉన్నాను. ధోనీ చాలాసేపు ప్రాక్టీసు చేశాడు(కరోనా రాకముందు ప్రాక్టీసులో). మీరు త్వరలో హెలికాప్టర్ షాట్లను చూస్తారు. ఐపీఎల్‌కు మహీ గ్రేట్ బ్రాండ్ అంబాసిడర్, అత్యుత్తమ క్రికెటర్"
-ఓ వర్చువల్ వీడియోలో సురేశ్ రైనా
ఐపీఎల్లో పాల్గొనడంలో భాగంగా పంజాబ్, దిల్లీ, కోల్‌కతా జట్లు దుబాయ్ చేరుకోగా.. బెంగళూరు, చెన్నై టీమ్‌లు శుక్రవారం ఆ దేశానికి పయనమయ్యాయి.
చెన్నై జట్టులోని హర్భజన్ సింగ్ వ్యక్తిగత కారణాలతో కొన్ని రోజుల తర్వాత యూఏఈ వెళ్లనుండగా, దక్షిణాఫ్రికా క్రికెటర్లు లుంగి ఎంగిడి, డుప్లెసిస్ సెప్టెంబరు తొలి వారంలో అక్కడికి చేరుకోనున్నారు. బ్రావో, ఇమ్రాన్ తాహిర్, మిచెల్ శాంట్నర్‌లు కరీబియన్ ప్రీమియర్ లీగ్ ముగిసిన తర్వాత యూఈఏకి పయనమవుతారు.