భారత సైన్యానికి టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని రెండు నెలలు పాటు సేవలందించేందుకు తీసుకున్న నిర్ణయంపై మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ప్రశంసలు కురిపించాడు. మహీ నిర్ణయం యువతకు స్ఫూర్తి కలిగిస్తుందని అన్నాడు.
"సైన్యానికి సేవలందించాలని భావించిన ధోని నిర్ణయం అభినందనీయం. ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి చాలా ధైర్యం ఉండాలి. ఈ నిర్ణయంతో సైన్యంపై తనకున్న అంకితభావాన్ని చాటుకున్నాడు ధోని. యూత్ ఫాలోయింగ్ ఉన్న ధోనీని చూసి వారికి సైన్యంలో పనిచేయాలనే భావన, స్ఫూర్తి కలుగుతుంది".
-గౌతం గంభీర్, మాజీ క్రికెటర్, ఎంపీ
ధోనిపై మాజీ క్రికెటర్ ఇదే తీరులో ప్రశంసలు కురిపించాడు. ఎక్కువ యూత్ ఫాలోయింగ్ ఉన్న సైన్యం దుస్తుల్లో కనిపించి వారిలో స్ఫూర్తి కలిగిస్తాడని ఆశించాడు.
ధోని భారత ఆర్మీ రెజిమెంట్ విభాగంలో తన రెండు నెలల శిక్షణను గురువారం ప్రారంభించాడు. పారాషూట్ రెజిమెంట్‌లో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న ధోని బుధవారం బెటాలియన్‌తో కలిసి లెఫ్టినెంట్ కల్నల్ బాధ్యతలు స్వీకరిస్తాడు.