ETV Bharat / sports

'ధోనీ దృష్టిలో పడేందుకు బాగా కష్టపడ్డా'

author img

By

Published : Jun 18, 2020, 4:41 PM IST

Updated : Jun 18, 2020, 4:46 PM IST

తన కెరీర్​పై మాజీ సారథి ధోనీ ప్రభావం ఉందని చెప్పిన స్పిన్నర్​ అశ్విన్.. ఐపీఎల్​ తొలి సీజన్​లో అతడి కంట్లో పడేందుకు చాలా కష్టపడినట్లు తెలిపాడు.

ధోని, అశ్విన్​
ధోని, అశ్విన్​

టీమిండియా స్పిన్నర్​గా పలు రికార్డులు సృష్టించిన రవిచంద్రన్​ అశ్విన్​.. తన కెరీర్​పై మాజీ సారథి ధోనీ ప్రభావం బాగా ఉందని చెప్పాడు. ఐపీఎల్​ ప్రారంభ సీజన్​లో చెన్నై సూపర్​కింగ్స్​కు ఎంపికైనప్పుడు, మెరుగైన ప్రదర్శన చేసి మహీ కళ్లలో పడేందుకు తీవ్రంగా శ్రమించినట్లు వెల్లడించాడు. సీఎస్​కే జట్టు.. తన కెరీర్​ను అద్భుతంగా మలిచిందని తెలిపాడు.

"చెన్నై జట్టులోని ప్రతి ఆటగాడు గుర్తింపు తెచ్చుకోవాలని భావిస్తాడు. నాకైతే మరింత ఎక్కువుగా ఉండేది. ఉత్తమ ఆటగాళ్లయిన ధోనీ, హేడెన్​, మురళీధరన్​కు​ అశ్విన్​ అంటే ఎవరో తెలీదు. అందుకే నా ప్రతిభతో వాళ్ల దృష్టిలో పడాలని నిర్ణయించుకున్నాను. ధోనీ నన్ను గుర్తించేందుకు చాలా ప్రయత్నాలు చేశాను. ఎట్టకేలకు ఛాలెంజర్ ట్రోఫీలో అతడి దృష్టి నాపై పడింది"

-రవిచంద్రన్ అశ్విన్​.

ఆ తర్వాత ఛాంపియన్స్ లీగ్​లో విక్టోరియా బుష్​రెంజర్స్​తో మ్యాచ్​లో తనపై నమ్మకముంచిన ధోనీ.. సూపర్​ ఓవర్​కు బౌలింగ్​ చేసే అవకాశం ఇచ్చినట్లు అశ్విన్ చెప్పాడు. తనను ఎంతగానో ప్రోత్సాహించినట్లు పేర్కొన్నాడు. దీనితోపాటే స్పిన్నర్​గా ఎదిగేందుకు తన ఇంజనీరింగ్​ కోర్సు చాలా ఉయోగపడిందని అన్నాడు.

భారత్​ తరఫున 71 టెస్టులు, 111 వన్డేలు, 46 టీ20లు ఆడిన అశ్విన్.. అన్నింట్లో కలిపి 567 వికెట్లు తీశాడు. అయితే ఇందులో 365 వికెట్లు ఎడమచేతివాటం బ్యాట్స్​మెన్​వే కావడం విశేషం.

ఇది చూడండి : కేరళ రంజీ జట్టులో శ్రీశాంత్.. కానీ?​​

Last Updated : Jun 18, 2020, 4:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.