భారత క్రికెట్ జట్టు మాజీ సారథి మాహేంద్ర సింగ్ ధోనీపై విమర్శలు గుప్పించాడు మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్. మహీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు మేటి ఆటగాళ్లను తయారుచేయలేకపోయాడని వ్యాఖ్యానించాడు. మాజీ క్రికెటర్, కెప్టెన్ గంగూలీ.. యువరాజ్, హర్భజన్, జహీర్ ఖాన్, వీరేంద్ర సెహ్వాగ్ లాంటి వారిని తయారుచేసి ధోనీకి అందించాడని గుర్తు చేశాడు. ప్రస్తుత కోహ్లీసేనకు ధోనీ అలాంటి సాయం చేయలేదని అభిప్రాయపడ్డాడు.
"సౌరభ్ గంగూలీ సారథిగా మంచి జట్టుని తయారు చేసి ధోనీకి ఇస్తే..? అతడు అలాంటి జట్టును ప్రస్తుత సారథి కోహ్లీకి ఇవ్వలేకపోయాడు. మహీ సారథ్యంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా తప్ప మిగితా ఏ క్రికెటర్లు బలమైన ఆటగాళ్లుగా రూపుదిద్దుకోలేదు."
-గంభీర్, టీమ్ఇండియా మాజీ క్రికెటర్.
ఇటీవల ధోనీని లక్కీ కెప్టెన్‌గా అభివర్ణించిన గంభీర్.. మెరుగైన జట్టు ఉండటం వల్లే పెద్దగా కష్టపడకుండానే మహీ ఐసీసీ ట్రోఫీలు గెలిచినట్లు వెల్లడించాడు. 2011 ప్రపంచకప్ విజయం సాధించడానికి ఇదే కారణమన్నాడు. దాదా.. తన సారథ్యంలో కఠోర శ్రమతో వారిని తీర్చిదిద్దాడని చెప్పుకొచ్చాడు.
ఇది చూడండి : 'టీమ్ఇండియా గెలుస్తుంది.. కోహ్లీతో అదే చెప్పా'