ETV Bharat / sports

'ఆ విషయం నేను ధోనీ నుంచే నేర్చుకున్నా'

author img

By

Published : Apr 15, 2020, 8:08 AM IST

ప్రముఖ క్రికెటర్ ధోనీలో నమ్మశక్యం కాని శక్తి దాగి ఉందని చెప్పాడు ఆసీస్ మాజీ క్రికెటర్ మైకెల్ హస్సీ. అతడి నుంచి తాను ఓ విషయం నేర్చుకున్నానని చెప్పుకొచ్చాడు.

MS Dhoni Believes He Who Panics Last Wins The Game, Says Michael Hussey
మహేంద్ర సింగ్ ధోనీ

టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఆసీస్ మాజీ క్రికెటర్ మైకెల్ హస్సీ. వీరిద్దరూ ఐపీఎల్​లో చెన్నై సూపర్​కింగ్స్ తరఫున ఆడారు. డెత్ ఓవర్లలో మహీ ఎలా బ్యాటింగ్ చేస్తాడో వివరించాడు హస్సీ. ఓ వ్యూహం ప్రకారం మ్యాచ్​లను ముగిస్తుంటాడని అన్నాడు.

dhoni with hussey
మైక్ హస్సీతో టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ

"క్రికెట్లో మహేంద్ర సింగ్ ధోనీ అద్భుతమైన ఫినిషర్. మ్యాచ్​ జరుగుతున్నప్పుడు సైలెంట్​గా వ్యూహాలు రచిస్తాడు. అతడిలో నమ్మశక్యం కాని శక్తి దాగుంది. బంతిని ఎప్పుడు బౌండరీ దాటించాలో మహీకి బాగా తెలుసు. అనుకున్న సమయంలో హిట్టింగ్ చేయగలడు. అతడి ఆత్మవిశ్వాసం అలాంటిది. ఒకే ఓవర్​లో 12-13 పరుగులు చేయడం ధోనీ నుంచి నేను నేర్చుకున్నా. ఆఖరి వరకు వేచి చూడటం మహీ స్టైల్​. ఎందుకంటే ఆ సమయంలో ఒత్తిడి తనపై కంటే బౌలర్లపైనే ఎక్కువగా ఉంటుందని అతడికి బాగా తెలుసు" -మైకెల్ హస్సీ, ఆసీస్ మాజీ క్రికెటర్

గతేడాది ప్రపంచకప్​లో న్యూజిలాండ్​తో సెమీస్​లో చివరగా ఆడిన ధోనీ, ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు ​మైదానంలో కనిపించలేదు. ఐపీఎల్​లో బరిలోకి దిగాలనుకున్న అతడికి కరోనా రూపంలో అడ్డంకి ఎదురైంది. భారత్​లో లాక్​డౌన్​ను మే 3వ తేదీకి పొడిగించడం వల్ల, టోర్నీ నిర్వహణపై సందేహాలు నెలకొన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.