ETV Bharat / sports

ధోనీ కథతో 'కెప్టెన్ 7' యానిమేటెడ్ సిరీస్ - dhoni ipl csk

టీమ్​ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ నేపథ్య కథతో 'కెప్టెన్ 7' యానిమేటెడ్​ సిరీస్​ను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఇది ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశముంది.

MS Dhoni announces animated spy series 'Captain 7'
ధోనీ కథతో 'కెప్టెన్ 7' యానిమేటెడ్ సిరీస్
author img

By

Published : Apr 7, 2021, 5:07 PM IST

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఎంఎస్‌ ధోనీ వివిధ రంగాల్లో అడుగు పెడుతున్నాడు. ఇప్పటికే క్రీడా వ్యాపారంలోకి దిగాడు. సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాడు. ఇప్పుడు 'కెప్టెన్‌ 7' పేరుతో యానిమేటెడ్‌ సిరీస్‌ను నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి.

ధోనీకి ఏడో నంబర్‌ జెర్సీ అంటే ఇష్టం. అందుకే యానిమేటెడ్‌ సిరీస్‌కు 'కెప్టెన్‌ 7' అని పేరు పెట్టారు. సిరీసులో తొలి సీజన్‌ పూర్తిగా గూఢచర్యం నేపథ్యంలో ఉంటుందని, ధోనీ ఆధారంగా కథ తెరకెక్కుతోందని తెలిసింది. 'కథ, కథనం గొప్పగా ఉన్నాయి. క్రికెట్‌తో పాటు నా ఇతర అభిరుచులను ఇది ప్రతిబింబిస్తుంది' అని ధోనీ తెలిపాడు.

MS Dhoni announces animated spy series 'Captain 7'
టీమ్​ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ

మహీ, సాక్షి నేతృత్వంలోని ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, బ్లాక్‌ వైట్‌ ఆరెంజ్‌ బ్రాండ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంయుక్త భాగస్వామ్యంలో సిరీస్‌ను నిర్మిస్తుండటం విశేషం. 'కెప్టెన్‌ 7' పూర్తిగా సాహసోపేతంగా ఉంటుందని నిర్మాతలు అంటున్నారు. 2022లో వివిధ వేదికల్లో తొలి సీజన్‌ మొదలవుతుంది.

ప్రస్తుతం చెన్నై సూపర్‌కింగ్స్‌ను ఐపీఎల్‌లో గెలిపించేందుకు ధోనీ కంకణం కట్టుకున్నాడు! నెల రోజులుగా విపరీతంగా సాధన చేస్తున్నాడు. తొలి మ్యాచ్​లో దిల్లీ క్యాపిటల్స్​తో తలపడనుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.