ETV Bharat / sports

స్టేడియాలకు రాజకీయ నాయకుల పేర్లు.. ఇదే మొదటిసారా? - వాజ్​పేయ్ స్టేడియం

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం మొతేరాకు నరేంద్ర మోదీ స్టేడియంగా పేరు మార్చారు. అయితే ఇలా ఓ రాజకీయ నాయకుడి పేరు క్రికెట్ స్టేడియానికి పెట్టడం కొత్తేం కాదు. ఇంతకుముందు కూడా ఇలాంటి సంఘటనలు చాలానే జరిగాయి. అవేంటో చూద్దాం.

Motera renamed after PM Modi.
మోదీ స్టేడియం
author img

By

Published : Feb 25, 2021, 11:11 AM IST

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా మొతేరాను తీర్చిదిద్దిన తర్వాత బుధవారం దానికి నరేంద్ర మోదీ స్టేడియంగా పేరు మార్చారు. దీనిపై పలు విమర్శలూ వస్తున్నాయి. అయితే ఇలా స్టేడియానికి ఓ రాజకీయ నాయకుడి పేరు పెట్టడం ఇదేమీ కొత్తకాదు. ఇంతకుముందూ చాలా స్టేడియాలకు ఇలా పేరు మార్చారు. కానీ ఏ ఒక్క క్రికెటర్ పేరు కూడా మైదానాలకు పెట్టకపోవడం గమనార్హం. అలా ఇప్పటివరకు పేరు మారిన స్టేడియాలేంటి? అవి ఏ రాజకీయ నాయకుడి పేరు మీదు ఉన్నాయో చూద్దాం.

మొతేరా టూ మోదీ

ప్రస్తుతం సర్దార్ పటేల్ స్డేడియంగా వెలుగొందుతున్న దీనికి నరేంద్ర మోదీ స్టేడియంగా పేరు మార్చారు. కానీ క్రీడా ప్రాంగణానికి సర్దార్ పటేల్ పేరు కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ ప్రాంగణంలో మొత్తం 20 సముదాయాలు ఉన్నాయి. అందులో ఫుట్​బాల్, హాకీ, బాస్కెట్​బాల్, కబడ్డీ, బాక్సింగ్, లాన్ టెన్నిస్ వంటి క్రీడా సముదాయాలు ఉన్నాయి. ఇందులో క్రికెట్ స్టేడియం కూడా ఒక భాగం. దీనికి మాత్రమే మోదీ స్టేడియంగా పేరు మార్చారు.

బతికుండగానే స్టేడియాలకు నాయకుల పేర్లు.. ఇదే మొదటిసారా?

కాదు. ముంబయిలోని వాంఖడే (శేష్​రావు క్రిష్ణరావు వాంఖడే), బ్రబోర్న్ (లార్డ్ బ్రబోర్న్) స్టేడియాలకు వారు బతికుండగానే నామకరణం చేశారు. అలాగే నేవీ ముంబయిలోని డీవై పాటిల్ (డీవై పాటిల్), బెంగళూరులోని చిన్నస్వామి (చిన్నస్వామి), చెన్నైలోని చిదంబరం (చిదంబరం) స్టేడియాలకు ఆయా రాజకీయ నాయకులు జీవించి ఉండగానే పేర్లు పెట్టారు. ఇంకా 2015లో మొహాలీ క్రికెట్ స్టేడియానికి ఐఎస్ బింద్రా స్టేడియంగా పేరు మార్చారు.

Wankhede
వాంఖడే స్టేడియం

క్రికెటర్ల పేర్ల మీద స్టేడియాలు ఉన్నాయా?

లేవు. ఇప్పటివరకు దేశంలోని ఏ క్రికెట్ స్టేడియానికి క్రికెటర్ల పేర్లు పెట్టలేదు. రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, సంగీతకారులు, జనరల్ మేనేజర్ల పేర్ల మీద స్టేడియాలు ఉన్నాయి కానీ క్రికెటర్లకు మాత్రం ఆ భాగ్యం దక్కలేదు.

రాజకీయ నాయకులు.. స్టేడియాల పేర్లు

జవహార్ లాల్ నెహ్రూ పేరు మీద తొమ్మిది స్టేడియాలకు పేర్లు పెట్టారు. ఇందులో న్యూదిల్లీ, చెన్నై, కొచ్చి, ఇండోర్, గుహవటి, మార్గావ్, పుణె, ఘజియాబాద్​ స్టేడియాలు ఉన్నాయి. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ మ్యాచ్​లు జరిగాయి.

ఇందిరా గాంధీ - గుహవటి, న్యూదిల్లీ, విజయవాడ

రాజీవ్ గాంధీ - హైదరాబాద్, దేహ్రాదూన్, కొచ్చి

వాజ్​పేయ్ - నాడౌన్, లఖ్​నవూ

సర్దార్ పటేల్ - వల్సద్, అహ్మదాబాద్ (బుధవారం మోదీ స్టేడియంగా మార్చారు)

Rajiv gandhi
రాజీవ్ గాంధీ స్టేడియం

ఫిరోజ్​ షా కోట్ల టూ అరుణ్ జైట్లీ

2019లో దివంగత అరుణ్ జైట్లీ పేరు మీద ఫిరోజ్ షా కోట్ల మైదానానికి ఆయన పేరు పెట్టారు.

అలాగే కేరళలోని ఈఎంఎస్ స్టేడియానికి అక్కడి కమ్యూనిస్ట్ లీడర్, రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి నంబూద్రిపాద్ పేరు పెట్టారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.