స్టువర్ట్ బ్రాడ్ (36 పరుగులు)
ఇటీవలే టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో ఇంగ్లాండ్ బౌలర్‌గా ఘనత సాధించాడు స్టువర్ట్ బ్రాడ్. అయితే గతంలో ఈ పేసర్ తన కెరీర్లోనే చెత్త రికార్డు నమోదు చేసుకున్నాడు. ఏకంగా ఓవర్లో 36 పరుగులు సమర్పించుకున్నాడు.
![t20 bowler latest news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8431640_645_8431640_1597489394849.png)
అది 2007 టీ20 ప్రపంచకప్.. సెప్టెంబర్ 19న డర్బన్‌లో ఇంగ్లాండ్-భారత్ మధ్య మ్యాచ్. ఆ పోరులో బ్రాడ్ బౌలింగ్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదేశాడు టీమ్ఇండియా బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్. ఫలితంగా టీ20ల్లో వేగవంతమైన అర్ధ శతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు. కేవలం 12 బంతుల్లోనే 50 రన్స్ సాధించాడు. ఈ రికార్డు దాదాపు 13 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉంది. ఆ మ్యాచ్‌లో భారత్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది.
శివమ్ దూబే (34 పరుగులు)
![t20 bowler latest news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8431640_935_8431640_1597489265719.png)
టీమ్ఇండియా యువ ఆల్‌రౌండర్ శివమ్ దూబే అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్ల జాబితాలో చోటు పొందాడు. పొట్టి ఫార్మాట్లో అత్యధిక పరుగులిచ్చిన రెండో బౌలర్‌గా నిలిచాడు. ఫిబ్రవరి 2న.. న్యూజిలాండ్-భారత్ మధ్య ఐదో టీ20 జరిగింది. ఈ మ్యాచ్‌లో 10వ ఓవర్ వేసిన దూబే... మొత్తం 34 పరుగులు ఇచ్చుకున్నాడు. న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ సీఫెర్ట్-రాస్ టేలర్ చెలరేగి ఆడారు. సీఫెర్ట్ రెండు సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టగా.. టేలర్ రెండు సిక్సర్లు, ఫోర్ బాదేశాడు. అందులో ఒకటి నో బాల్ కాగా.. మరొక సింగిల్ లభించింది. ఈ ఓవర్ తర్వాత దూబేకు మళ్లీ బంతి ఇవ్వలేదు కెప్టెన్ రోహిత్ శర్మ. అయితే మిగతా బౌలర్ల ప్రదర్శన కారణంగా ఈ మ్యాచ్‌లో భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది.
వేన్ పార్నెల్, ఇజాతుల్లా దవ్లత్జాయ్, స్టువర్ట్ బిన్నీ, మాక్స్ ఓడౌడ్ (32 పరుగులు)
![t20 bowler latest news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8431640_714_8431640_1597489299783.png)
టీ20ల్లో ఒకే ఓవర్లో 32 పరుగులు ఇచ్చిన సందర్భాలు నాలుగుసార్లు నమోదయ్యాయి. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వేన్ పార్నెల్(దక్షిణాఫ్రికా) ఈ చెత్త ఫీట్ నమోదు చేశాడు. ఇతడి బౌలింగ్‌లో జాస్ బట్లర్ తనదైన బ్యాటింగ్‌తో చెలరేగిపోయాడు.
2012, సెప్టెంబర్ 21న ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 32 పరుగులు ఇచ్చుకున్నాడు ఇజాతుల్లా దవ్లత్జాయ్(అఫ్ఘానిస్థాన్).
భారత ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీ ఖాతాలోనూ ఇలాంటి చెత్త రికార్డు చేరింది. వెస్టిండీస్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో ఏకంగా ఐదు సిక్సర్లు సమర్పించుకున్నాడు.
స్కాట్లాండ్తో పోరులో 32 పరుగులు ఇచ్చుకున్నాడు మాక్స్ ఓడౌడ్(నెదర్లాండ్స్). ఇతడి బౌలింగ్‌లో నాలుగు సిక్సర్లు, రెండు ఫోర్లు బాదేశాడు ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ జార్జ్ మున్సే.
మహ్మద్ సైఫుద్దీన్ (31 పరుగులు)
![t20 bowler latest news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8431640_377_8431640_1597489762531.png)
2017, అక్టోబర్ 29న బంగ్లాదేశ్-దక్షిణాఫ్రికా మధ్య టీ20 మ్యాచ్ జరిగింది. ఇందులో సౌతాఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్ చెలరేగి ఆడాడు. ఏకంగా 36 బంతుల్లో 101 పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్‌ను మహ్మద్ సైపుద్దీన్కు పీడకలలా మిగిల్చాడు. ఈ బౌలర్ బౌలింగ్‌లో మిల్లర్ 5 సిక్సర్లు, ఓ సింగిల్‌తో ఏకంగా 31 పరుగులు పిండుకున్నాడు. ఈ టీ20 మ్యాచ్‌లో 224 పరుగులు చేసిన ప్రొటీస్ జట్టు.. ఏకంగా 83 రన్స్ తేడాతో విజయం సాధించింది.
డారిల్ టఫీ, బిల్వాల్ భట్టి, రాబ్ టేలర్, హమీద్ షా, షకిబ్ అల్ హసన్ (30 పరుగులు)
![t20 bowler latest news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8431640_190_8431640_1597489893440.png)
టీ20ల్లో 30 పరుగులు ఇచ్చిన ఆటగాళ్ల జాబితాలో ఐదుగురు బౌలర్లు నిలిచారు. ఇందులో డారిల్ టఫీ(న్యాజిలాండ్).. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఈ చెత్త ఫీట్ నమోదు చేశాడు. 2005, ఫిబ్రవరి 17న జరిగిన ఈ మ్యాచ్‌లో రికీ పాంటింగ్ నాలుగు సిక్సర్లు, ఒక ఫోర్, ఒక డబుల్ రన్ సాధించాడు.
పాకిస్థాన్ బౌలర్ బిల్వాల్ భట్టి బౌలింగ్‌ను తుత్తునీయలు చేశారు ఆస్ట్రేలియా ప్లేయర్లు ఆరోన్ ఫించ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్. ఫలితంగా ఇతడి ఓవర్లో 30 పరుగులు లభించాయి.
స్కాట్లాండ్ బౌలర్ రాబ్ టేలర్ బౌలింగ్‌లో 30 పరుగులు పిండుకున్నాడు హాంకాంగ్ బ్యాట్స్‌మన్ తన్వీర్ అఫ్జల్. ఏకంగా నాలుగు సిక్సర్లు, ఒక ఫోర్, ఒక డబుల్ రన్ సాధించాడు.
డెన్మార్క్ బౌలర్ హమీద్ షా కూడా 5 సిక్సర్లు ఇచ్చుకున్నాడు. ఈ మ్యాచ్‌లో జర్మనీకి చెందిన క్రెగ్ మెస్చెడే తనదైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు.
బంగ్లాదేశ్ సీనియర్ క్రికెటర్ షకిబ్ అల్ హసన్ కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. 2019, సెప్టెంబర్ 13న జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో ఈ చెత్త ఫీట్.. షకిబ్ ఖాతాలో చేరింది. బ్యాట్స్‌మన్ ర్యాన్ బర్ల్ ఏకంగా మూడు సిక్సర్లు, మూడు ఫోర్లతో రాణించాడు. ఈ మ్యాచ్‌లో షకిబ్ నాలుగు ఓవర్లలో 49 పరుగులు ఇచ్చినా.. చివరికి బంగ్లా జట్టు 3 వికెట్ల తేడాతో నెగ్గింది.