ఐపీఎల్ వేలంలో రికార్డు ధరకు అమ్ముడైన ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు రాజస్థాన్ రాయల్స్ జట్టు డైరెక్టర్ సంగక్కర. రాజస్థాన్ జట్టులో అతను కీలక పాత్ర పోషించనున్నాడని అన్నాడు. పేసర్ జోఫ్రా ఆర్చర్‌కు.. చక్కని సహకారం అందిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.
గురువారం జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో అత్యధికంగా రూ.16.25 కోట్లు వెచ్చించి మోరిస్‌ను సొంతం చేసుకుంది రాజస్థాన్ జట్టు.
"జోఫ్రా ఆర్చర్‌కు చక్కని సహకారం అందించేందుకు.. మోరిస్ అన్ని విధాల ఉపయోగపడతాడు. మోరిస్ అన్ని ఐపీఎల్‌లలో ఉత్తమ ఆటగాడిగా రాణించాడు. ఆటను ప్రభావితం చేయగలిగే ఆటగాళ్లలోనూ టాప్‌లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఆలోచిస్తే మోరిస్ మాకు చాలా అవసరం. ఈ నేపథ్యంలో ఆర్చర్‌ను కూడా మేం భిన్నంగా ఉపయోగించుకోవచ్చు."
- సంగక్కర, రాజస్థాన్ రాయల్స్ డైరెక్టర్.
ఆండ్రూ టై, ముస్తఫిజుర్ రెహ్మాన్‌తో పాటు యువ భారత ఆటగాళ్లు తమ జట్టులోకి చేరడం వల్ల రాజస్థాన్‌కు మరింత బలం చేకూరినట్లయిందని సంగక్కర హర్షం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:'అర్జున్ ఈ ఘనత నీది.. ఎవరూ తీసుకుపోలేరు'