ETV Bharat / sports

'మోర్గాన్, కమిన్స్ మొదటి మ్యాచ్​ ఆడతారు' - ఐపీఎల్​ వార్తలు

ఇంగ్లాండ్​, ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఆలస్యం కాకుండానే జట్టులో చేరతారని కేకేఆర్​ సీఈఓ వెంకీ మైసూర్​ తెలిపారు. ప్రత్యేక విమానంలో సెప్టెంబరు 17న వీరంతా యూఏఈ చేరుకుంటారని వెల్లడించారు.

ipl
ఐపీఎల్​
author img

By

Published : Sep 11, 2020, 5:47 PM IST

ఈ ఏడాది యూఏఈ వేదికగా జరిగే ఐపీఎల్​లో కోల్​కతా నైట్​ రైడర్స్​ జట్టుకు ఇంగ్లాండ్​, ఆస్ట్రేలియా ఆటగాళ్లు సరైన సమయంలోనే అందుబాటులోకి వస్తారని ఫ్రాంచైజీ సీఈఓ వెంకీ మైసూర్​ అన్నారు. బయో సెక్యూర్​ వాతావరణం నుంచి మరో బబుల్​లోకి ప్రవేశిస్తుండటం వల్ల.. వీరంతా లీగ్​లో విధించిన ఆరు రోజుల క్వారంటైన్​ నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే దుబాయ్​కి చేరుకునే విదేశీ ఆటగాళ్లు.. తొలి రోజు నుంచే ఐపీఎల్​ జట్టు సభ్యులతో కలిసిపోనున్నారు. మరోవైపు కరోనా పరీక్షల్లో నెగిటివ్ వస్తే దుబాయ్​ ప్రభుత్వం తప్పనిసరి విధించిన క్వారంటైన్​ కూడా అవసరం లేదు.

ipl
ఐపీఎల్​లో కేకేఆర్​ ఘనతలు

"వారిని (ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఆటగాళ్లు) శానిటైజ్​ చేయించిన విమానంలో తీసుకొచ్చి ఇమ్మిగ్రేషన్​, టెస్టింగ్​, కాంటాక్ట్​ లెస్ తదితర అంశాలను జాగ్రత్తగా చూసుకుంటే బుడగలోకి రావడానికి అనుమతిస్తారా?. ఐపీఎల్​ సజావుగా సాగేందుకు.. చాలా వ్యూహాత్మకంగా వెళ్తున్నారు. అందుకోసం ఏఓపీ(ప్రొటోకాల్స్​)ను కూడా విధించారు. అయితే, ఒక బబుల్​లో నుంచి మరొక బబుల్​లోకి వస్తే.. ఆటగాళ్లకు తప్పనిసరి క్వారంటైన్​ అవసరం లేదు."

-వెంకీ మైసూర్​, కేకేఆర్​ సీఈఓ

ఇటీవలే విడుదల చేసిన ఐపీఎల్​ షెడ్యూల్​ ప్రకారం.. సెప్టెంబరు 23న కేకేఆర్​ తొలి మ్యాచ్​ ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్​, ఆసీస్ సిరీస్​ ముగిసిన వెంటనే.. ఆటగాళ్లంతా ప్రత్యేక విమానంలో సెప్టెంబరు 17 నాటికి యూఏఈకి చేరుకోనున్నారు

ప్రస్తుతం ఇరు దేశాలు ఆడుతున్న సిరీస్​లో కేకేఆర్​కు చెందిన ముగ్గురు ఆటగాళ్లు ఉన్నారు. ఇంగ్లాండ్​ కెప్టెన్​ మోర్గాన్​, బ్యాట్స్​మన్​ టామ్​ బాంటన్​, ఆసీస్​ పేసర్​ పాట్​ కమిన్స్ కేకేఆర్ తరఫున లీగ్​లో ఆడనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.