ETV Bharat / sports

ఇంగ్లాండ్​ బౌలర్​పై సచిన్​ విమర్శలు!

author img

By

Published : Feb 4, 2021, 10:56 PM IST

ఇంగ్లాండ్​ స్పిన్నర్​ జాక్​లీచ్​ బౌలింగ్​ గురించి మాట్లాడిన సచిన్.. అతడు నెమ్మదిగా బౌలింగ్ చేస్తాడని అన్నాడు. అది భారత్​ జట్టుపై అంతగా ప్రభావం చూపదని అభిప్రాయపడ్డాడు. శుక్రవారం నుంచి టీమ్​ఇండియా-ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది.

sachin
సచిన్​

ఇంగ్లాండ్​ స్పిన్నర్​ జాక్​లీచ్​ బౌలింగ్​ విధానాన్ని విమర్శించాడు భారత దిగ్గజ క్రికెటర్ సచిన్​ తెందుల్కర్​. అతడు వేసే బంతులు అంతగా ప్రభావం చూపవని అభిప్రాయపడ్డాడు. ఇంగ్లీష్​ జట్టు మాజీ పేసర్లు గ్రేమ్ స్వాన్​, మాంటీ పనేసర్​ లాగా వేగంగా బంతులు సంధించలేడని అన్నాడు. 2012లో ఇంగ్లాండ్​ సిరీస్​ విజయం సాధించడంలో స్వాన్​, పనేసర్​ కీలక పాత్ర పోషించారు.

jack leach
జాక్​లీచ్​

"ప్రపంచంలోనే ఉత్తమ బౌలర్లలో గ్రేమ్​ స్వాన్​, మాంటీ పనేసర్ ఉంటారు. 2012లో భారత్​-ఇంగ్లాండ్​ మధ్య జరిగిన టెస్టు సిరీస్​లో వారు ప్రదర్శన అద్భుతం. చాలా వేగవంతంగా బంతులు విసురుతారు. అయితే జాక్​ లీచ్​ అలాంటి బౌలర్​ కాదు. చాలా నెమ్మదిగా బౌలింగ్​ చేస్తాడు. స్పిన్ ఎక్కువ అయ్యే పిచ్ పై బంతి విసిరే వేగాన్ని అతడు నియంత్రిస్తే విజయవంతం అయ్యే అవకాశం ఉంది" అని సచిన్​ అన్నాడు.

ఫిబ్రవరి 5నుంచి ఇంగ్లాండ్​-భారత్​ మధ్య చెపాక్​ వేదికగా తొలి టెస్టు జరగనుంది. అయితే ఈ మైదానంలో ఎర్ర మట్టి కారణంగా బంతులు ఎక్కువగా బౌన్స్​ అవుతాయని అన్నాడు సచిన్​. 15వ ఓవర్​ నుంచి దాదాపు 60వ ఓవర్​ వరకు బంతి రివర్స్​ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పాడు. ఈ స్టేడియంలో ఫాస్ట్​ బౌలర్లు కీలకంగా వ్యవహరిస్తారని అభిప్రాయపడ్డాడు.

ఆస్ట్రేలియాలో దాదాపు రెండు నెలలపాటు సిరీస్​ ఆడింది టీమ్​ఇండియా. మరి అక్కడ ఆడిన ప్రభావం.. చెపాక్​ స్టేడియంలో ఆడేటప్పుడు బ్యాట్స్​మెన్​పై పడుతుందా అని పలు సందేహాలు వ్యక్తమయ్యాయి. దీని గురించి కూడా సచిన్ మాట్లాడారు. "ప్రతి బ్యాట్స్​మెన్​కు భిన్నమైన విధానం ఉంటుంది. కాబట్టి అక్కడి ప్రభావం ఇక్కడేమి పడదు. పుజారా విషయానికొస్తే అతడు అద్భుతంగా ఆడతాడు. ఆస్ట్రేలియా సిరీస్​లో తానేంటో నిరూపించాడు. అతడి ఆటతీరుకు ముగ్ధుడయ్యాను" అని​ చెప్పాడు.

ఇదీ చూడండి: ద్రవిడ్‌పై సచిన్‌ అలిగిన వేళ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.