ETV Bharat / sports

'ధోనీలో నాకు నచ్చే విషయం అదే..' - ధోని గురించి మాట్లాడిన షమీ

టీమిండియా మాజీ సారథి ధోనీతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు పేసర్ మహ్మద్ షమి. మహీని ఎంతగానో మిస్​ అవుతున్నట్లు వెల్లడించాడు.

dhoni,shami
ధోని, షమీ
author img

By

Published : Jun 3, 2020, 1:55 PM IST

టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్ ధోనీని చాలా మిస్సవుతున్నట్లు చెప్పుకొచ్చాడు పేసర్ మహ్మద్ షమి. తనతో ఉన్న అనుబంధాన్ని ఇన్‌స్టా లైవ్‌ చాట్‌లో అభిమానులతో పంచుకున్నాడు.

"ఐపీఎల్ మినహా అన్ని ఫార్మాట్లలో ధోనీతో కలిసి ఆడాను. అతడు చాలా పెద్ద ఆటగాడు. నాకు తనతో చాలా అనుభవాలున్నాయి. ఇప్పుడు కూడా మహీ భాయ్ మళ్లీ వస్తాడని అనుకుంటున్నాం. అతడితో ఆడటం సరదాగా ఉంటుంది. ధోనీ ఎప్పుడూ ఒంటరిగా ఉండడు. అతడి చుట్టూ ఎవరో ఒకరు ఉంటారు. ధోనీ అందరితో కూర్చొని డిన్నర్‌ చేయడానికి ఇష్టపడతాడు. ఆ విషయం నాకెంతో నచ్చుతుంది. అతడి చుట్టూ ఎప్పుడూ ఇద్దరి నుంచి నలుగురు వ్యక్తులు ఉంటారు. రాత్రంతా మేము మాట్లాడుకున్న సందర్భాలున్నాయి. అవన్నీ ఇప్పుడు మిస్‌ అవుతున్నాం"

-షమి, టీమిండియా ఫాస్ట్ బౌలర్‌.

ఐపీఎల్ వేదికగా ధోనీ ఆటను వీక్షించాలనుకున్న అభిమానులకు కరోనా వైరస్‌ అడ్డంకిగా మారింది. ఈ మహమ్మారి కారణంగా టోర్నమెంటు వాయిదా పడింది. జులై నుంచి క్రికెట్‌ మ్యాచ్‌లు తిరిగి ప్రారంభం చేయాలని భావిస్తోంది బీసీసీఐ. కానీ ఐపీఎల్ విషయంలో ఏం జరుగుతుందన్నది ఇంకా తేలలేదు.

గత సంవత్సరం ప్రపంచకప్‌ సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌ తర్వాత నుంచి ధోనీ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు.

ఇదీ చూడండి : కరోనా తర్వాత మళ్లీ ట్రాక్​పైకి రయ్​.. రయ్​..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.