పాకిస్థాన్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా ఆ దేశ మాజీ క్రికెటర్ మహ్మద్ వసీం నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని పీసీబీ స్పష్టం చేసింది. చీఫ్ సెలక్టర్‌గా ఎంపికవ్వడంపై హర్షం వ్యక్తం చేశాడు వసీం. తన బాధ్యతను నిష్పక్షపాతంగా నిర్వర్తిస్తానని అన్నాడు.
అంతకుముందు చీఫ్ సెలక్టర్‌తో పాటు హెడ్ కోచ్‌గానూ బాధ్యతలు నిర్వర్తించాడు మిస్బావుల్ హక్. ఇటీవల కాలంలో జట్టు ఘోరంగా విఫలమవుతున్న నేపథ్యంలో సెలక్టర్ పదవి నుంచి అతడిని తప్పించి వసీంను నియమించింది పీసీబీ. 2023 ప్రపంచకప్ వరకు ఇతడు ఈ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.
ఇదీ చూడండి : చీఫ్ సెలెక్టర్ పదవి నుంచి మిస్బాకు ఉద్వాసన!