పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మహమ్మద్ హఫీజ్ బయో సెక్యూర్ బబుల్ నిబంధనలు ఉల్లంఘించాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్నా.. బుడగ దాటి బయటి వ్యక్తులను కలిశాడు. అతను చేసిన ట్వీట్ ద్వారానే ఆ విషయం తెలిసింది. టెస్టు, టీ20 సిరీస్ కోసం ఇంగ్లాండ్‌లో పాక్ ప్రస్తుతం పర్యటిస్తోంది. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి, పూర్తి బయో సెక్యూర్ బబుల్ వాతావరణంలో ఆ సిరీస్‌ను నిర్వహిస్తున్నారు. అయితే టీ20 జట్టులో సభ్యుడైన హఫీజ్ తను ఉంటున్న హోటల్‌కు అనుకునే ఉన్న గోల్ఫ్ కోర్సులో ఓ పెద్దావిడతో ఫోటో తీసుకుని.. ఆమె తనకు స్ఫూర్తినిచ్చిందంటూ బుధవారం ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టాడు. బయటి వ్యక్తులను కలవకూడదనే నిబంధనను ఉల్లంఘించినందుకు అతనిప్పుడు ఐదు రోజులు ఐసోలేషన్‌లో ఉంటాడని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తెలిపింది. కరోనా నిర్ధరణ పరీక్షల్లో నెగెటివ్ వస్తేనే అతను తిరిగి జట్టుతో చేరతాడు.
ట్వీట్‌తో దొరికిన పాక్ మాజీ కెప్టెన్
బయో బబుల్ నిబంధనలు అతిక్రమించిన పాక్ మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్.. ట్వీట్ చేసిన దొరికిపోయాడు. దీంతో అతడిని ఐదు రోజులు ఐసోలేషన్‌లో ఉంచనున్నారు.