పాకిస్థాన్ ప్రపంచకప్ తుదిజట్టులో పేసర్లు మహ్మద్ ఆమిర్, వాహబ్ రియాజ్‌లకు చోటు లభించింది. ఈ విషయాన్ని పాక్ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఇంగ్లాండ్ పిచ్‌లపై వారి అనుభవం పనికొస్తుందని విశ్వాసం వ్యక్తంచేసింది. లెఫ్టార్మ్ పేసర్ జునైద్ ఖాన్, ఆల్‌రౌండర్ ఫహీం అష్రఫ్ స్థానంలో వీరిని తీసుకుంది.
చికెన్ పాక్స్ కారణంగా ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు ఆమిర్. ప్రస్తుతం లండన్‌లో చికిత్స తీసుకుని మెరుగయ్యాడని సెలెక్టర్లు వెల్లడించారు.
పాకిస్థాన్ ఓపెనర్ అబిద్ అలీ స్థానంలో అసిఫ్ అలీకి చోటు దక్కింది. వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు దూరంగా ఉన్న షాదాబ్ ఖాన్ జట్టులో చోటు నిలుపుకున్నాడు. ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్ తన తొలి మ్యాచ్‌లో మే31న వెస్టిండీస్‌తో తలపడనుంది.
-
BREAKING: Mohammad Amir and Wahab Riaz included in Pakistan’s final #CWC19 squad.
— Cricket World Cup (@cricketworldcup) May 20, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
More to follow... pic.twitter.com/qjEZFJ7Ccp
">BREAKING: Mohammad Amir and Wahab Riaz included in Pakistan’s final #CWC19 squad.
— Cricket World Cup (@cricketworldcup) May 20, 2019
More to follow... pic.twitter.com/qjEZFJ7CcpBREAKING: Mohammad Amir and Wahab Riaz included in Pakistan’s final #CWC19 squad.
— Cricket World Cup (@cricketworldcup) May 20, 2019
More to follow... pic.twitter.com/qjEZFJ7Ccp
ప్రస్తుతం పాకిస్థాన్ జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది. ఆతిథ్య జట్టుతో ఆదివారంతో ముగిసిన ఐదు వన్డేల సిరీస్‌ను 4-0తో చేజార్చుకుంది. తొలి వన్డే వర్షం కారణంగా రద్దైంది. ఈ వన్డే సిరీస్‌లో పాక్ పేలవ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకున్న సెలక్టర్లు, జట్టు మేనేజ్‌మెంట్ పలు కీలక మార్పులు చేశారు.
పాకిస్థాన్ జట్టు
సర్ఫరాజ్ అహ్మద్ (సారథి), అసిఫ్ అలీ, బాబర్ ఆజం, ఫఖర్ జమాన్, హరిస్ సోహైల్, హసన్ అలీ, ఇమాద్ వాసీం, ఇమామ్ ఉల్ హక్, మహ్మద్ ఆమిర్, మహ్మద్ హఫీజ్, మహ్మద్ హస్నేన్, షాదాబ్ ఖాన్, షాహీం అఫ్రిదీ, షోయబ్ మాలిక్, వాహబ్ రియాజ్
ఇవీ చూడండి.. కేన్సర్‌తో యువ క్రికెటర్ కుమార్తె మృతి