భారత స్టార్ క్రికెటర్ మిథాలీ రాజ్.. 1999 జూన్ 26న ఐర్లాండ్‌పై వన్డేతో క్రికెట్లోకి అడుగుపెట్టింది. అప్పటి నుంచి 20 ఏళ్లుగా క్రికెట్లో కొనసాగుతోంది. ఫలితంగా ఎక్కువ కాలం క్రికెట్ ఆడిన మహిళగా పేరు తెచ్చుకుంది. ఇన్నేళ్ల పాటు కెరీర్ కొనసాగించిన వారిలో దిగ్గజ ఆటగాళ్లు సచిన్ తెందూల్కర్(22ఏళ్ల 91 రోజులు), సనత్ జయసూర్య(21 ఏళ్ల 184 రోజులు), జావేద్ మియాందాద్(20 ఏళ్ల 272 రోజులు) ఉన్నారు. వీరి సరసన చేరిన మిథాలీ... ఈ ఘనత సాధించిన ఏకైక మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది. మొత్తంగా ఇప్పటివరకు 203 వన్డేల్లో 51.29 సగటుతో 6,720 పరుగులు చేసిందీ స్టార్ ప్లేయర్.

పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై...
మిథాలీ రాజ్.. ఇటీవలే పొట్టి క్రికెట్‌కు వీడ్కోలు పలికింది. 2021 ఐసీసీ వన్డే మహిళల ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొనే... టీ20 ఫార్మాట్‌కు దూరం అవుతున్నట్లు చెప్పింది. 32 అంతర్జాతీయ టీ20లు ఆడిన ఈ క్రికెటర్.... 2012 (శ్రీలంక), 2014 (బంగ్లాదేశ్), 2016 (భారత్)లో జరిగిన ప్రపంచకప్‌లలో పాల్గొంది.

మిథాలీ.. 1999లో ఇంగ్లాండ్‌తో తొలి టీ20 ఆడింది. పొట్టి క్రికెట్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసింది. 89 మ్యాచ్‌ల్లో 37.50 సగటుతో 2,364 పరుగులు చేసింది. అత్యధిక స్కోరు 99 నాటౌట్. టీ20ల్లో 2000 పరుగులు చేసిన తొలి బ్యాట్స్ ఉమెన్‌గానూ ఘనత సాధించింది. 10 టెస్టులే ఆడిన మిథాలీ... 663 పరుగులు చేసింది. వాటిలో ఒక సెంచరీ, నాలుగు అర్ధశతకాలు ఉన్నాయి.