టీమిండియా సారథి విరాట్ కోహ్లీ, మాజీ సారథి ఎంఎస్ ధోనీల్లో ఎవరు అత్యుత్తమం? అనేది చాలా కష్టమైన ప్రశ్న. అయితే ఈ విషయాన్ని తేల్చేందుకు ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫో సంస్థ పెట్టిన ఓ పోటీలోని తుదిపోరులో విజేతగా నిలిచాడు కింగ్ కోహ్లీ. గత దశాబ్దం(2010-2019)లో ఎక్కువ మంది మెచ్చిన పురుష క్రికెటర్ ఎవరు? అనే ప్రశ్నకు... విరాట్‌ను ఎక్కువమంది ఎంచుకున్నారు.
ఇలా జరిగింది?
కొంతమంది టాప్ క్రికెటర్లను ఎంపిక చేసి పోల్ నిర్వహించింది క్రిక్‌ఇన్ఫో. గతేడాది డిసెంబర్ 16 నుంచి ఈ ఏడాది జనవరి 5 వరకు పోల్ సాగింది. ఇందులో కోహ్లీ, ధోనీకి 75 శాతానికి పైగా ఓట్లు రావడం వల్ల ఫైనల్ చేరారు. తాజాగా సెమీస్ ఓటింగ్ 2020, జనవరి 7, ఉదయం 10 గంటలకు ముగిసింది. ఇందులో ఫలితాల ఆధారంగా విరాట్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో మహీ, విరాట్ అభిమానులు భారీ స్థాయిలో ఓట్లు వేసినట్లు ఆ సంస్థ వెల్లడించింది. టాప్-2లో భారత క్రికెటర్లు నిలవడంపై హర్షం వ్యక్తం చేసిందీ సంస్థ. మూడు, నాలుగు స్థానాల్లో దక్షిణాఫ్రికా క్రికెటర్ డివిలియర్స్, న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ నిలిచారు.
రీడర్లు ఓట్లతో మహిళల్లో అత్యత్తమ క్రీడాకారిణిగా భారత జట్టు వన్డే సారథి మిథాలీ రాజ్ నిలిచింది. ఆ సంస్థ ఉద్యోగుల ఓట్లతో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ ఎలిస్ పెర్రీ అగ్రస్థానంలో నిలిచింది. పురుష విభాగంలో రెండిటిలోనూ విరాట్ గెలవడం విశేషం.
-
Our readers' picks for the Cricketers of the 2010s: Mithali Raj and Virat Kohli pic.twitter.com/KTAR9K5qyw
— ESPNcricinfo (@ESPNcricinfo) January 7, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Our readers' picks for the Cricketers of the 2010s: Mithali Raj and Virat Kohli pic.twitter.com/KTAR9K5qyw
— ESPNcricinfo (@ESPNcricinfo) January 7, 2020Our readers' picks for the Cricketers of the 2010s: Mithali Raj and Virat Kohli pic.twitter.com/KTAR9K5qyw
— ESPNcricinfo (@ESPNcricinfo) January 7, 2020
విరాట్ టాప్ స్కోరర్
గత దశాబ్దంలో 27 వేలకు పైగా పరుగుల చేసి, అత్యధిక పరుగుల వీరుడిగా పేరు తెచ్చుకున్నాడు. తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియాకు చెందిన వార్నర్, లంక మాజీ సారథి సంగక్కర, న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్, ఆస్ట్రేలియా క్రికెటర్ అరోన్ ఫించ్ ఉన్నారు.
ఇదీ చదవండి...