కడుపునొప్పితో బాధపడుతోన్న టీమ్ఇండియా పేసర్ బుమ్రాను వైద్యబృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని టీమ్ఇండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాఠోడ్ చెప్పాడు. అతడు త్వరగా కోలుకునేందుకు మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు తెలిపాడు. ఆస్ట్రేలియాతో నాలుగో(చివరి) టెస్టుకు ఇతడు అందుబాటులో ఉండే విషయమై తుది నిర్ణయం శుక్రవారం తీసుకుంటారని అన్నాడు. ఒకవేళ అతడు ఆడగలిగే పరిస్థితిలో ఉంటే తప్పకుండా తుది జట్టులో ఉంటాడని వెల్లడించాడు. మూడో టెస్టు అయిన తర్వాత నుంచి బుమ్రా కడుపునొప్పితో బాధపడుతున్నాడు.
-
💥💥 In all readiness for the Gabba Test 💪🏻#TeamIndia #AUSvIND pic.twitter.com/x86s0o70dJ
— BCCI (@BCCI) January 13, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">💥💥 In all readiness for the Gabba Test 💪🏻#TeamIndia #AUSvIND pic.twitter.com/x86s0o70dJ
— BCCI (@BCCI) January 13, 2021💥💥 In all readiness for the Gabba Test 💪🏻#TeamIndia #AUSvIND pic.twitter.com/x86s0o70dJ
— BCCI (@BCCI) January 13, 2021
"టీమ్ఇండియా ఆటగాళ్లకు తగిలిన గాయాలను వైద్యబృందం నిత్యం పరిశీలిస్తూనే ఉంది. నాలుగో టెస్టుకు బుమ్రా ఆడుతాడో లేదో తుది నిర్ణయం శుక్రవారం తీసుకుంటారు. అలానే ఈ మ్యాచ్‌కు సంబంధించి తుది జట్టులో ఆడబోయే 11 మంది పేర్లను రేపు(శుక్రవారం) ప్రకటిస్తారు"
-విక్రమ్ రాఠోడ్, టీమ్ఇండియా బ్యాటింగ్ కోచ్.
నాలుగో టెస్టు జనవరి 15 నుంచి బ్రిస్బేన్ వేదికగా ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ మ్యాచ్‌కు బౌలర్లు షమి, ఉమేశ్, ఇషాంత్‌తో పాటు కేఎల్ రాహుల్, జడేజా, విహారి గాయాల కారణంగా దూరమయ్యారు. ఇరు జట్లు చెరో మ్యాచులో గెలిచి 1-1తో సిరీస్‌ను సమంగా ఉన్నాయి. మూడో టెస్టు డ్రాగా ముగిసింది. చివరి మ్యాచులో నెగ్గి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భారత్-ఆసీస్ పోటాపోటీగా ఉన్నాయి.
ఇదీ చూడండి : మూడో టెస్టు: బుమ్రా, సిరాజ్‌పై జాతి వివక్ష వ్యాఖ్యలు