ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పోటీలో ఆస్ట్రేలియా లేకపోవడం నిరాశకు గురిచేసిందని ఆ జట్టు కోచ్ జస్టిన్ లాంగర్ అన్నాడు. అందుకు టీమ్‌ఇండియాతో ఆడిన మెల్‌బోర్న్ టెస్టులో తమ స్లో ఓవర్ రేట్ బౌలింగే కారణమని ఆయన అభిప్రాయపడ్డాడు. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
"ఆ మ్యాచ్ ముగిశాక మా ఆటగాళ్లతో మాట్లాడాను. వారికి జరిగిన విషయం వివరించాను. రెండు ఓవర్లు స్లో బౌలింగ్ చేశామని, అది టెస్టు ఛాంపియన్‌షిప్ అవకాశాలను దూరం చేసే పరిస్థితి కల్పించొచ్చని అన్నాను. తర్వాత ఆడే సిడ్నీ, గబ్బా టెస్టుల్లో అలాంటి తప్పు జరగకూడదని చెప్పాను. అది బాగా నిరాశ కలిగించింది. ఒక గుణపాఠంలా అనిపించింది. ఇకపై జాగ్రత్తగా ఉండాలనే విషయం నేర్పింది."
- జస్టిన్ లాంగర్, ఆస్ట్రేలియా కోచ్
గతేడాది డిసెంబర్ 26న భారత్, ఆస్ట్రేలియా జట్లు మెల్‌బోర్న్ వేదికగా బాక్సింగ్ డే టెస్టులో తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో అజింక్య రహానె సెంచరీ సాధించి జట్టును విజయపథంలో నడిపించాడు. అయితే, ఆ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు నిర్ణీత సమయం కన్నా ఆలస్యంగా బౌలింగ్ చేసింది. దాంతో టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో నాలుగు పాయింట్లు కోతకు గురైంది.
-
That victory against England means India finish the league phase of the inaugural ICC World Test Championship with a fine view from the top of the table 🔝#INDvENG | #WTC21 pic.twitter.com/rXFiKPXdB7
— ICC (@ICC) March 6, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">That victory against England means India finish the league phase of the inaugural ICC World Test Championship with a fine view from the top of the table 🔝#INDvENG | #WTC21 pic.twitter.com/rXFiKPXdB7
— ICC (@ICC) March 6, 2021That victory against England means India finish the league phase of the inaugural ICC World Test Championship with a fine view from the top of the table 🔝#INDvENG | #WTC21 pic.twitter.com/rXFiKPXdB7
— ICC (@ICC) March 6, 2021
ఇదిలా ఉండగా, ఆస్ట్రేలియా ఇటీవల దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్ ఆడాల్సి ఉంది. అయితే, అక్కడ కరోనా కేసుల్లో పెరుగుదల కారణంగా కంగారూల జట్టు సిరీస్‌ను రద్దు చేసుకుంది.
-
India 🤜🤛 New Zealand
— ICC (@ICC) March 6, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
The inaugural ICC World Test Championship finalists!
The wait will be unbearable. #WTC21 | #INDvENG pic.twitter.com/X3KcNrUTJ1
">India 🤜🤛 New Zealand
— ICC (@ICC) March 6, 2021
The inaugural ICC World Test Championship finalists!
The wait will be unbearable. #WTC21 | #INDvENG pic.twitter.com/X3KcNrUTJ1India 🤜🤛 New Zealand
— ICC (@ICC) March 6, 2021
The inaugural ICC World Test Championship finalists!
The wait will be unbearable. #WTC21 | #INDvENG pic.twitter.com/X3KcNrUTJ1
మరోవైపు ఆసీస్‌తో జరిగిన బోర్డర్-గావస్కర్ సిరీస్‌ను 2-1 తేడాతో టీమ్‌ఇండియా కైవసం చేసుకోవడం సహా.. స్వదేశంలో ఇంగ్లాండ్‌ను 3-1 తేడాతో ఓడించడం వల్ల టెస్టు ఛాంపియన్‌షిప్ పోటీల్లో అగ్రస్థానం సంపాదించింది. దాంతో జూన్ 18న సౌథాంప్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో తుదిపోరుకు సిద్ధపడింది.
ఇదీ చూడండి: 'ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్'గా అశ్విన్