ఆస్ట్రేలియా క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ తన సిక్సర్లతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంటాడు. ఇప్పుడో అమ్మాయి మనసు దోచుకున్నాడని, ఆమెతో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడని సమాచారం. భారత సంతతికి చెందిన విని రామన్‌తో కలిసి పార్టీల్లో మునిగితేలుతున్నాడు ఈ ఆసీస్ ఆటగాడు. వీరిద్దరూ ఆస్ట్రేలియా వీధుల్లో చెట్టాపట్టాలేసుకుని తెగ తిరిగేస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
అయితే వీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ మ్యాక్స్‌వెల్, విని రామన్ ఒక్కటైతే భారత అమ్మాయిని పెళ్లాడిన రెండో ఆసీస్ క్రికెటర్‌గా మ్యాక్సీ నిలవనున్నాడు. ఇంతకు ముందు షాన్ టైట్ భారత యువతినే పెళ్లాడాడు. 2014 ఐపీఎల్ సమయంలో మాషుమ్ సింఘాను కలిసిన టైట్ అనంతరం ఆమెను వివాహం చేసుకున్నాడు.
ఐపీఎల్ ద్వారా మ్యాక్స్‌వెల్‌కు భారత్‌లోనూ అభిమానులున్నారు. ఇటీవల జరిగిన ప్రపంచకప్‌లో పెద్దగా రాణించని మ్యాక్సీ ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో జరుగుతున్న టీ 20 బ్లాస్ట్‌లో సత్తాచాటుతున్నాడు. లాంక్షైర్ తరపున విజృంభిస్తున్నాడు.
ఇది చదవండి: 'జాతీయ గీతం పాడుతుంటే కళ్లల్లో నీళ్లు తిరిగాయి'